భాను కిరణ్ మొదటి ఆయుధం సూరి నుంచే...

Bhanu Kiran
హైదరాబాద్ : భాను కిరణ్ తన గురువు మద్దెలచెర్వు సూరి నుంచే మొదటి ఆయుధాన్ని సేకరించినట్లు చెబుతున్నారు. భాను ఇప్పటి దాకా పదుల సంఖ్యలో ఆయుధాలను వాడినట్లు తెలిసింది. అందులో 9 ఆయుధాల గురించి కస్టడీలో వెల్లడించగా వాటిలో ఐదింటిని (హైదరాబాద్‌లో4, సియోన్‌లో1) సీఐడీ అధికారులు ఇప్పటికే సీజ్ చేసినట్లు సమాచారం. మరో నాలుగు ఆయుధాల్లో కడప జిల్లాలో రెండు, అనంతపురం జిల్లాలో రెండు దాచినట్లు భాను చెప్పినట్లు తెలుస్తోంది.

మంగళవారం సిఐడి విచారణలో భాను కిరణ్ పలు విషయాలు వెల్లడించినట్లు చెబుతున్నారు. కడప జిల్లాకు చెందిన దంతలూరి కృష్ణ, అనంతపురం జిల్లాకు చెందిన మద్యం వ్యాపారి సుధాకర్ నాయుడు భానుకు ఆయుధాలు సమకూర్చారని చెబుతున్నారు. మిగతా నాలుగు ఆయుధాలు కూడా వారివద్దే ఉన్నట్లు సీఐడీ భావిస్తోంది. ఆయుధాలు చేతికి చిక్కగానే వీరిని కూడా ఒకటి రెండు రోజుల్లో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకోవచ్చని తెలిసింది.

సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్ తో సంబంధాలు పెట్టుకున్నవారిపై సీఐడీ దృష్టి సారించింది. వారం రోజుల క్రితం భానును కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు అతను వెల్లడించిన అంశాల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ముంబైలో డీ గ్యాంగ్ తరహాలో ఇక్కడ బీ గ్యాంగ్ ఏర్పాటు చేసి విదేశాల నుంచి చక్రం తిప్పాలనేది తన ఆలోచనగా భాను కస్టడీలో వెల్లడించాడు.

సూరి హత్య తర్వాత అన్నీ సవ్యంగా జరిగితే విదేశాల్లో వ్యాపారం ప్రారంభించి ఇక్కడ నేరసామ్రాజ్యాన్ని ఏలాలనేది భాను వేసిన క్రిమినల్ ప్లాన్‌గా చెబుతున్నారు. ఈ మేరకు తన ఖాతాల్లో కోట్లాది రూపాయల సొమ్మును ముందుగానే సమకూర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎక్కువగా తుపాకులతో సావాసం చేశాడు.

మధ్యప్రదేశ్‌లోని సియోన్‌లో భాను నివసించిన ఇంట్లో నుంచి సోమవారం స్వాధీనం చేసుకున్న మూడు సెల్‌ఫోన్ల కాల్‌డేటాను సీఐడీ సేకరిస్తోంది. వీటిని హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)కు అప్పగించినట్లు సమాచారం. అంతేగాక అక్కడి అభిషేక్ గార్డెన్‌లో భాను తలదాచుకున్న ఇంటికి సమీపంలోని ఓ కాయిన్ బాక్స్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కాయిన్ బాక్స్ నుంచి వెళ్లిన ఫోన్ నెంబర్ల సమాచారం ఆధారంగా రాష్ట్రంలోని పలువురిని సీఐడీ అనుమానిస్తోంది. ఆ సమాచారం ఆధారంగా ఇప్పటికే భానుకిరణ్ సోదరుడు వంశీకిరణ్ పై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

నిజానికి సూరి హత్య జరిగిన వెంటనే వంశీ కిరణ్‌ను పోలీసులు తీసుకొచ్చి తమదైన శైలిలో ప్రశ్నించారు. అప్పటికి వంశీకి భాను అందుబాటులో లేడు. భవిష్యత్తులో భాను ఫోన్‌చేస్తే తమకు చెప్పాలని హెచ్చరించి పోలీసులు వంశీని వదిలిపెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకే సీఐడీ వెబ్‌సైట్‌లో తన ఫొటోలను చూసిన భాను తన సోదరుడికి సియోన్ నుంచి ఫోన్ చేశాడు. సూరి అనుచరుల కదలికల గురించి, సీఐడీ పోలీసుల దర్యాప్తు తీరు, ఇక్కడి పత్రికల్లో వస్తున్న వార్తల గురించి వంశీ ఎప్పటికప్పుడు భానుకు చేరవేసేవాడు. ఈ విషయాన్ని వంశీ బయటపెట్టకపోయినా కాయిన్‌బాక్స్ కాల్స్ ఆధారంగా సీఐడీ దీన్ని పసిగట్టగలిగింది.

భానుకిరణ్‌తో సత్సంబంధాలు నెరిపి ప్రత్యర్థి కాంట్రాక్టర్లను బెదిరించేలా చేసిన హంద్రీ నీవా కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేయడానికి సీఐడీ రంగం సిద్ధం చేస్తోంది. నెల రోజుల పాటు పాండిచ్చేరిలో రెండు లాడ్జిలలో బసచేసిన భాను అక్కడేమైనా సెటిల్‌మెంట్లు చేశాడా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. అక్కడి లాడ్జికి వెళ్లి భాను ఉన్న రూమ్‌కు సర్వీస్ చేసిన వారిని ప్రశ్నించినట్లు సమాచారం.

అజ్ఞాతంలో ఉన్నప్పుడు భానుకిరణ్ మూడుసార్లు షిరిడీసాయిని దర్శించుకున్నాడు. ఒకసారి భాను అక్కడ ఉన్నప్పుడే.. రాష్ట్రానికి చెందిన ఇద్దరు పోలీసులు కుటుంబంతో కలిసి బాబా దర్శనానికి వెళ్లారు. యాదృచ్ఛికంగా తమ కంటపడిన భానును వారు ఒకింత అనుమానంగా చూసినప్పటికీ.. అతణ్ని గుర్తించలేక వదిలేశారు. భాను మాత్రం వారిని ఆంధ్రా పోలీసులుగా గుర్తించాడు. అలాగే, మరోసారి గోవాకు వెళ్లిన భానుకు అనంతపురానికి చెందిన వ్యక్తులు తారసపడ్డారు. వారి పక్కనే గోవా బీచ్‌లో అరగంటకు పైగా కూర్చున్నా గుర్తించలేక పోయారు. వారిలో ఒకరిని అనంతపురం వ్యక్తిగా భాను గుర్తించినా.. పలకరిస్తే గుట్టురట్టవుతుందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+