రెస్ట్ తీసుకో: డిఎల్‌ను తప్పుపట్టిన వీరశివా, అహ్మదుల్లా

డిఎల్ రవీంద్రా రెడ్డి రాజకీయాలలో అలసిపోతే విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమని సూచించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ లేకుండా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు.
అభ్యర్థుల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ ఏకపక్షంగా వ్యవహరించలేదని మంత్రి అహ్మదుల్లా అన్నారు. ఆయా నియోజకవర్గాల కార్యకర్తలను సంప్రదించిన తర్వాతనే అభ్యర్థులను ఖరారు చేశారని చెప్పారు. డిఎల్ రవీంద్రా రెడ్డి అంటే తనకు గౌరవం ఉందని అందుకే ఆయనకు వ్యతిరేకంగా తాను మాట్లాడదల్చుకోలేదని చెప్పారు.
ఉప ఎన్నికలలో ఆయన కాంగ్రెసుకు సహకరిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపికపై మాకు ఎలాంటి అసంతృప్తి లేదని తేల్చి చెప్పారు. అభ్యర్థుల ఎంపిక సజావుగా, సక్రమంగా జరిగిందని చెప్పారు. ఉప ఎన్నికల తర్వాత తాను కాంగ్రెసు పార్టీని వీడతాననే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. తన శరీరంలో ప్రవహించేది కాంగ్రెసు రక్తం అన్నారు. అభ్యర్థులను మార్చాలని తాను వాయలార్ రవికి ఎలాంటి లేఖ రాయలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications