హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొందరి స్వార్థం వల్లే ఉప ఎన్నికలు: జగన్‌పై బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: కొందరి స్వార్థపూరిత ఆలోచనల వల్లనే ఉప ఎన్నికలు వస్తున్నాయని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఎస్సీ సెల్ కార్యవర్గ సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. విమర్సలు చేయడం తప్ప ప్రతిపక్షాలకు వేరే పని లేదని, ప్రతిపక్షాల విమర్శలను నమ్మవద్దని ఆయన అన్నారు.

పార్టీ కార్యకర్తలు నిరాశానిస్సృహలకు లోను కావద్దని, రాబోయే కాలంలో విజయం తమదేనని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ధైర్యంగా వెళ్లి ఓట్లు అడగవచ్చునని ఆయన అన్నారు. పనిచేసే వారికే ఎన్నికల్లో టికెట్లు వస్తాయని ఆయన చెప్పారు. దళిత, మైనారిటీ, బిసిల వ్యక్తిత్వాన్ని కాంగ్రెసు పార్టీ కాపాడుతుందని ఆయన అన్నారు. మంచినీరు, కరెంట్ వంటి సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే, పదే పదే ఎన్నికలు వస్తున్నాయని ఆయన అన్నారు.

స్థానిక పరిస్థితుల కారణంగానే పార్టీ అభ్యర్థుల్లో మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసులోనే దళితులకు న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. అంతా ఐక్యంగా ముందుకు పోవాలని, కాగ్రెసు అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎఐసిసి కార్యదర్శి కెబి కృష్ణమూర్తి కూడా పాల్గొన్నారు.

ఎన్నికలతో ప్రజాధనం వృధా అవుతోందని కృష్ణమూర్తి అన్నారు. ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయో ప్రజలకు వివరించి కాంగ్రెసుకు ఓట్లు అడగాలని ఆయన సూచించారు. సిట్టింగ్ శాసనసభ్యుల రాజకీయాల వల్లనే ఉప ఎన్నికలు వచ్చాయని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలను సవాల్‌గా తీసుకోవాలని ఆయన సూచించారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ రుణం తెచ్చి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. రూ. 60 వేల కోట్ల రూపాయల రుణాన్ని ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చి చంద్రబాబు ఏమీ చేయలేకపోయారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైకిళ్ల నుంచి కార్లు కొనే స్థితికి వచ్చారు తప్ప ప్రజలకు ఏమీ జరగలేదని ఆయన అన్నారు.

English summary
PCC president Botsa Satyanarayana has blamed YSR Congress party president YS Jagan that bypolls are coming due to few leaders selfishness. He said that Congress will defeat opposition in future elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X