తమిళనాడు స్థితి: జగన్, చంద్రబాబులదే హవా?

వచ్చే ఉప ఎన్నికల ఫలితాలతో రాజకీయ ముఖ చిత్రం కచ్చితంగా రూపుదిద్దికుంటుందని అంటున్నారు. జూన్‌లో రాష్ట్రంలోని 18 శానససభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు జురగుతున్నాయి. ఈ నియోజకవర్గాలు 12 జిల్లాల్లో ఉన్నాయి. అంటే, దాదాపుగా సగం జిల్లాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నట్లు. అందుకే ఈ ఉప ఎన్నికలను మినీ సాధారణ ఎన్నికలుగా భావిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల భవిష్యత్తును తేల్చి వేస్తాయని అంటున్నారు.
కాంగ్రెసు పార్టీ పరిస్థితి అంతంతగా మాత్రంగానే ఉందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే, వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. వారు ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తెరిపి లేకుండా ప్రచారం సాగిస్తున్నారు. ఈ రెండు పార్టీలు కూడా మెజారిటీ స్థానాల్లో రెండో స్థానం కోసం మాత్రమే పోటీ పడుతున్నాయనే అభిప్రాయం బలంగా ఉంది.
నెల్లూరు జిల్లాలోని కోవూరు శాసనసభా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి రెండో స్థానం వచ్చింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆ స్థానాన్ని గెలుచుకుంది. దాదాపుగా ఇదే పరిస్థితి వచ్చే ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో ఉండవచ్చునని అంటున్నారు. దీంతో భవిష్యత్తులో రాష్ట్రంలో చంద్రబాబు, వైయస్ జగన్ హవానే కొనసాగుతుందనే అంచనాలు సాగుతున్నాయి. అయితే, వైయస్ జగన్ కోర్టు కేసుల్లో ఇరుక్కున్నారు. ఈ కేసుల ప్రభావం రాజకీయాలపై, ఆయన పార్టీ భవిష్యత్తుపై ఏ విధంగా ఉంటుందనేది చెప్పడం ప్రస్తుతం కష్టమే.
మొత్తంగా, రాష్ట్ర రాజకీయాల రూపు రేఖలు వచ్చే ఉప ఎన్నికల ఫలితాలతో మారిపోతాయని అంటున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల వైరంగా ఉన్న రాష్ట్ర రాజకీయాలు వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల వైరంగా మారుతుందనే అంచనాలు సాగుతున్నాయి. అయితే, ఇప్పుడే ఇటువంటి అంచనాకు రావడం తొందరపాటే అవుతుందనే అభిప్రాయం కూడా ఉంది.












Click it and Unblock the Notifications