వైయస్ జగన్‌పై కాంగ్రెసు నేతల ముప్పేట దాడి

వ్యవసాయం దండగన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చి వారు రైతు వ్యతిరేకులుగా మిగిలిపోయారని ఆయన అన్నారు. వారు విలువల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. వారు విలువల వలువలు విప్పిన దుశ్సాసనులని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రజలు సమాధి కడతారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీకి మెజారిటీ స్థానాలు వస్తాయని ఆయన అన్నారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత కరెంట్ ఇవ్వలేమన్న చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మబోరని కాంగ్రెసు నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన ప్రభుత్వం రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తోందని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం ధరను చంద్రబాబు ఐదు రూపాయలకు పెంచారని ఆయన అన్నారు. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు రావని ఆయన అన్నారు.
వైయస్ జగన్ మాటల్లో త్యాగం అంటే దోపిడీ అని మంత్రి శైలజానాథ్ అన్నారు. మరో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డితో కలిసి ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మక్షోభ క్షోభించేలా జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అధికారానికి అడ్డు వస్తారనుకుంటే జగన్ ఎవరినైనా ముంచేస్తాడని ఆయన అన్నారు. జగన్‌తో వెళ్లేవారు ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసమే జగన్ కాంగ్రెసు పార్టీని వీడారని ఆయన అన్నారు.
నిజాయితీ గురించి వైయస్ జగన్ మాట్లాడడం హాస్సాస్పదని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు శ్రీకాకుళం జిల్లాలో అన్నారు. జగన్‌పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు చేయడం హర్షనీయమని ఆయన అన్నారు. పత్రికా స్వేచ్ఛను కాంగ్రెసు కాపాడుతుందని ఆయన అన్నారు. కేసు కోర్టులో ఉన్నందున జగన్‌పై తాను మాట్లాడబోనని ఎఐసిసి కార్యదర్శి కెబి కృష్ణమూర్తి హైదరాబాదులో అన్నారు. ముఖ్యమంత్రి మారుతారనేది మాజీ మంత్రి శంకరరావు వ్యక్తిగతాభిప్రాయమని, పార్టీ అభిప్రాయం కాదని ఆయన అన్నారు. ఈ నెల 22 తర్వాత ఉప ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications