వివాహితను పెళ్లికి ఒత్తిడి చేసిన ఆటో డ్రైవర్ హత్య

రాజు గౌడ్ (27) అనే ఆటో డ్రైవర్‌ను హత్య చేసిన కేసులో శ్యామ్ రాజు, బాలకృష్ణ, కె. సంజు, ఎస్ ఆనంద్, భాను ప్రియలను పోలీసులు అరెస్టు చేశారు. తనను పెళ్లి చేసుకోవాలని రాజు గౌడ్ భాను ప్రియను వేధిస్తూ వచ్చాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. భాను ప్రియ ఓ ప్రైవేట్ కంపెనీలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం - కొన్ని నెలల క్రితం భాను ప్రియ రాజు గౌడ్ ఆటోలో ప్రయాణించింది. అప్పటి నుంచి అతను ఆమెతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్న రాజు తరుచుగా ఆమెకు ఫోన్ చేసి మాట్లాడసాగాడు. ఈ వేధింపులను భరించలేక భాను ప్రియ ఆ సమాచారాన్ని మామలు శ్యామ్ రాజు, బాలకృష్ణలకు చెప్పింది.
గత శనివారంనాడు రాజును శాంతినగర్‌కు పిలవాలని శ్యాం, బాలకృష్ణ భానుప్రియకు సూచించారు. రాజు గౌడ్ అక్కడికి చేరుకోగానే దాడి చేశారు. వారికి మిత్రులు సంజు, ఆనంద్ సహకరించారు. రాజును చంపేసి మృతదేహాన్ని పాక్షికంగా కాల్చేసి మూసీ నది ఒడ్డున పడేశారు. మర్నాడు మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రాజు గౌడ్ జిల్లెలగుడాకు చెందినవాడు.












Click it and Unblock the Notifications