16 నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు

సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాటు పూర్తయ్యాయి. మొత్తం 1780 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు 12 లక్షల 40వేల 296 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్ అభ్యర్థులు 6 లక్షల 25 వేల 244 మంది ఉన్నారు. వీరిలో బాలురు 3 లక్షల 46 వేల 240 మంది కాగా, బాలికలు 2 లక్షల 79 వేల నలుగురు ఉన్నారు. మొదటి సంవత్సరం వొకేషనల్ అభ్యర్థులు 38 వేల 566 మంది పరీక్షలకు హాజరవుతున్నారు.
ద్వితీయ సంవత్సరం జనరల్ అభ్యర్థులు 5 లక్షల 44 వేల 802 మంది కాగా, వీరిలో బాలురు 3 లక్షల 14 వేల 29 మంది, బాలికలు 2 లక్షల 30 వేల 773 మంది ఉన్నారు. వొకేషనల్ అభ్యర్థులు 31 వేల 684 మంది ఉన్నారు. సెకండ్ లాంగ్వేజ్ పరీక్షతో బదులుగా ఫిజిక్స్ పరీక్షతో ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి.
పరీక్షల సందర్భంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసిని కోరినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. పరీక్షల సమయంలో విద్యుత్ కోత లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అక్రమాలకు, మాల్ ప్రాక్టిస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల్లోకి ప్రచురతిమైన లేదా రాతపూర్వకమైన సమాచారాన్ని, సెల్ ఫోన్లను, పేజర్లను, కాలిక్యులేటర్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాలకు తీసుకుని రావద్దని ఆయన విద్యార్థులకు సూచించారు.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు మే, జూన్ 2012లకు సంబంధించి మే 28వ తేదీ నుంచి 31 తేదీ వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతాయి.












Click it and Unblock the Notifications