సాక్షి పత్రికను చదవొద్దు, సాక్షి టీవీ చూడొద్దు: విహెచ్

V Hanumantha Rao
హైదరాబాద్: తమ పార్టీని, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రికను చదవకూడదని, సాక్షి టీవీని చూడకూడదని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు పిలుపునిచ్చారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జరిగన సభలో ఆయన ప్రసంగించారు.

మీడియాను అడ్డం పెట్టుకుని జనగ్ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ కోసం అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పత్రికను పెడితే జగన్ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. పార్టీని దెబ్బ తీయడానికి కొన్ని విచ్ఛిన్నక శక్తులు ప్రయత్నిస్తున్నాయని, ఆ శక్తులను ఐక్యంగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు సూచించారు.

రాజీవ్ గాంధీ సేవలను మరిచిపోలేమని బొత్స సత్యనారాయణ అన్నారు. రాజీవ్ గాంధీ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేశారని, దాని వల్ల యువతకు ఉద్యోగావకాశాలు పెరిగాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ చేసిన సేవలను పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కొనియాడారు. రాజీవ్ గాంధీ జీవించి ఉంటే వి. హనుమంతరావు ముఖ్యమంత్రి అయి ఉండేవారని పిసిసి మాజీ అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు అన్నారు.

రాజీవ్ గాంధీ వర్ధంతి సభలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతా రెడ్డి, దానం నాగేందర్, సీనియర్ కాంగ్రెసు నాయకులు ప్రసంగించారు. ఎఐసిసి ప్రతినిధి, కేంద్ర మంత్రి కూడా ఈ సభలో పాల్గొన్నారు. ఆయన చెన్నై నుంచి నేరుగా గాంధీభవన్‌కు వచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బొత్స సత్యనారాయణ రాక కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఇరువురు ఒకే వాహనంలో గాంధీ భవన్‌కు చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+