"బెనిఫిట్ షోలకేనా మీ ఉత్సాహం?"- ఏపీ మౌనంపై కేతిరెడ్డి పంచ్..!
నీట్ సహా జాతీయ స్థాయి పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో చేపడుతున్న ఆందోళనల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్టాల నుంచి భారీ ఎత్తున యువత తరలివచ్చి పాలుపంచుకుంటున్నారు. అలాగే విపక్ష పార్టీల నాయకులంతా వారికి సంఘీభావం కూడా తెలియజేస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం నీట్ నిరసనల జాడేలేదు. ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న టీడీపీ, జనసేన వంటి పార్టీలు దీనిపై మౌనం వహిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో విద్యార్ధులు కూడా సైలెంట్ గా ఉండిపోతున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (Kethireddy Venkatarami Reddy) ఇవాళ నీట్ నిరసనలపై ఏపీ మౌనాన్ని ప్రశ్నిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఆయన.. మన ఏరియాలో నీట్ ఆందోళనలు ఎందుకు జరగటం లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. నీట్ పేపర్ జాతీయ స్థాయి పరీక్ష కదా. మన ఏరియాలో ఎందుకు జరగటం లేదో నాకు అర్థం కావడం లేదని కేతిరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మన వాళ్లు అందరూ కూడా బెనిఫిట్ షోలకు చూపించినంత ఉత్సాహం నీట్ పేపర్లు, సీబీఎస్ఈ పేపర్ల లీక్ మీద చూపించలేకపోతున్నారేమో అర్థం కావడం లేదన్నారు.

బ్రేకింగ్
— Rahul (@2024YCP) July 22, 2026
పేపర్ లీకేజీలపై మౌనం ఎందుకు?
నీట్ పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నా ఏపీలో ఎందుకు జరగడం లేదు
మన రాష్ట్రంలో సినిమా బెనిఫిట్ షోల మీద చూపిస్తున్నఉత్సాహం.. నీట్, DSC పేపర్ లీకేజీపై ఉంటడం లేదు
ప్రశ్నించాల్సిన వాళ్లే మౌనంగా ఉన్నప్పుడు.. మరొకరు ఎలా… pic.twitter.com/1J37BfAY0i
మన వాళ్లు బెనిఫిట్ షోలకు అయితే ఓపెన్ చేస్తానే ముందుకు ఉంటా అంటారని, నీట్ పేపర్ లీక్ అయినా కనపడరని కేతిరెడ్డి చురకలు అంటించారు. డీఎస్సీ లీక్ అయినా కనపడటం లేదు, ఏది లీక్ అయినా గాని మాట్లాడే గొంతుకలు లేవన్నారు. అంతేలే.. మాట్లాడాతా, ప్రశ్నిస్తా అనుకున్న వాళ్లే ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారని పవన్ కళ్యాణ్ పై కేతిరెడ్డి పంచ్ విసిరారు. ఇప్పటివరకూ కూటమి పార్టీలు ఢిల్లీలో సీజేపీ నిరసనలపై కానీ, నీట్ లీక్స్ పై కానీ స్పందించలేదు. వైసీపీ మాత్రం నిన్న సీజేపీ నిరసనలకు మద్దతుగా ఓ ట్వీట్ చేసింది. ఆ తర్వాత వరుసగా వైసీపీ నేతలు స్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications