బాలకృష్ణకు సర్జరీ.. నెల రోజుల పాటు బెడ్ రెస్ట్!
టాలీవుడ్ సీనియర్ నటుడు, హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మోకాలి శస్త్రచికిత్సం కోసం హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. వైద్య నివేదికల ప్రకారం బాలకృష్ణ మోకాలికి నేడు సర్జరీ జరగనుంది. ఆపరేషన్ అనంతరం కోలుకునేందుకు బాలకృష్ణ 4 నుంచి 5 వారాల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని చికిత్స అందిస్తున్న వైద్యుల బృందం సూచించింది. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో బాలకృష్ణ రాబోయే సినిమా షూటింగ్ షెడ్యూళ్లు.. అలాగే ముందుగా నిర్ణయించిన ప్రజా, రాజకీయ కార్యక్రమాలు వచ్చే నెల రోజుల పాటు తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంది.
'NBK111'(వర్కింగ్ టైటిల్) షూటింగ్ సమయంలో నందమూరి బాలకృష్ణ గాయపడిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్ట్ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ భారీ యాక్షన్ ప్లాన్ చేస్తుండగా బాలకృష్ణ మోకాలికి గాయం కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రముఖ నటుడు మంచు మనోజ్, బాలకృష్ణ మధ్య యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. వైద్యులు మోకాలికి సర్జరీ అవసరమని చెప్పడంతో ఆయన హైదరబాద్ వచ్చారు. హైదరాబాద్ లో ఫ్యామిలీ వైద్యుల సమక్షంలో ఈ సర్జరీ జరగనుంది.

నటసింహం బాలకృష్ణకు గాయమైందని తెలిసిన అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో బాలయ్య తదుపరి సినిమాల భవితవ్యంపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. సర్జరీ కారణంగా బాలకృష్ణ సినిమాలు ఆగిపోతాయా అనే ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో బాలకృష్ణకు మోకాలికి స్వల్ప గాయం మాత్రమే అయిందని.. ఎలాంటి మేజర్ సర్జరీ జరగలేదని వైద్యవర్గాలు, చిత్ర బృందం స్పష్టం చేశాయి. ఈ చిన్న విరామం వల్ల షూటింగ్ షెడ్యూల్స్ కాస్త అడ్జస్ట్ అవుతాయని.. ప్రాజెక్టుల విడుదలకు ఎలాంటి ముప్పులేదని సమాచారం. మరోవైపు బాలయ్య బాబు త్వరగా కోలుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, కళ్యాణ్ రామ్ సహా పలువురు సినీ ప్రముఖులు ట్వీట్లు చేశారు.
సూపర్ హిట్ మూవీ 'వీరసింహారెడ్డి' చిత్ర విజయం అనంతరం బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబినేషన్లలో ఈ చిత్ర రూపొందుతోంది. వృద్ధి సినిమాస్ పతాకం ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. ఈ సినిమాలో బాలయ్య గ్యాంగ్ స్టర్ తరహా పాత్రలో కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications