భాను కిరణ్తో కలిసి సెటిల్మెంట్లు చేశా: మంగలి కృష్ణ

భాను కిరణ్తో కలిసి హంద్రీ - నీవా ప్రాజెక్టు కాంట్రాక్టర్లు వెంకట నర్సింహా రెడ్డి, ఎస్వీ రంగారెడ్డిలను బెదిరించి దాదాపు రూ. 1.20 కోట్లు వసూలు చేసినట్లుగా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. భూవివాదాలకు సంబంధించి సెటిల్మెంట్లలో తాను ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు కూడా అతను చెప్పాడు. వివాదాస్పద స్థలాలను తమ పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు అతను సిబిఐ విచారణలో తెలిపాడు.
మంగలి కృష్ణకు జూన్ 6వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అతడ్ని చర్లపల్లి జైలుకు తరలించారు. చర్లపల్లి జైలులో మంగలి కృష్ణకు ప్రత్యేక రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశించింది. మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భాను కిరణ్ చర్లపల్లి జైలులోనే ఉంటున్నాడు. అంతకు ముందు సిఐడి అధికారులు మంగలి కృష్ణకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి, అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టారు.
మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భాను కిరణ్‌కు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేసిన కేసులో దంతలూరి కృష్ణ అలియాస్ మంగలి కృష్ణను సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ టోల్‌గేట్ వద్ద మంగళవారం సాయంత్రం కృష్ణను వారు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 2006 నుంచీ కృష్ణ పలుమార్లు తనకు ఆయుధాలు సరఫరా చేశాడని, వాటితోనే తాను భూ దందాలకు పాల్పడ్డానని సిఐడి అధికారులకు భాను వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications