సహజమే: జగన్‌పై కెవిపి వ్యాఖ్య, వైయస్‌పై నోకామెంట్

KVP Ramachandra Rao
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తమకు ప్రత్యర్థి కావడం సహజమేనని కెవిపి రామచంద్ర రావు బుధవారం అన్నారు. ఆయన ఉదయం గుంటూరు జిల్లాలో కాంగ్రెసు పార్టీ ప్రారంభించిన ప్రజాహిత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ టీవి ఛానల్‌తో మాట్లాడారు. ఉప ఎన్నికలు ప్రత్యేక పరిస్థితులలో వచ్చాయన్నారు. ప్రతి ఎన్నిక కాంగ్రెసుకు పరీక్షే అన్నారు.

మాకు ఇది రెఫరెండమే అని చెప్పారు. జగన్ తమకు ప్రత్యర్థి అయినా సరే అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెసు పార్టీ వేపే ఉంటానని చెప్పారు. తాను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మనే అన్నారు. తాను ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లలేదని చెప్పారు. వైయస్ పైన వస్తున్న అవినీతి ఆరోపణలు, సిబిఐ ఛార్జీషీట్లపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

తాను కాంగ్రెసు పార్టీ వల్లనే గుర్తింపు పొందానని చెప్పారు. తాను విద్యార్థి దశ నుండే కాంగ్రెసువాదినే అన్నారు. తాను ప్రత్యక్ష ఎన్నికల ప్రచారానికి రావడం ఇదే మొదటిసారి అన్నారు. కాంగ్రెసు పార్టీ కోసం గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి కృషి చేసేవారన్నారు. ఇప్పుడు తాను కాంగ్రెసు కార్యకర్తగా తన వంతు సేవ చేస్తానని చెప్పారు.

ఉప ఎన్నికలలో లబ్ధి పొందేందుకు సానుభూతి కోసమే జగన్ ఇతరులపై అభాండాలు వేస్తున్నారని మంత్రి శైలజానాథ్ వేరుగా మండిపడ్డారు. విచారణలో ఎక్కడ తన అవినీతి బయటపడుతుందోనని జగన్ భయపడుతున్నారన్నారు. తాను తనపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణకు సిద్ధమని మంత్రి ధర్మాన ప్రసాద రావు శ్రీకాకుళంలో అన్నారు. అల్లర్లతో ఎన్నికలను ఆపాలని చూస్తున్నారని జగన్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానులే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+