గాలి బెయిల్‌ను తాత్కాలికంగా రద్దు చేసిన హైకోర్టు

ప్రత్యేక కోర్టు ఇచ్చిన బెయిల్‌ను సిబిఐ హైకోర్టులో సవాల్ చేసింది. బెయిల్ మంజూరైనప్పటికీ గాలి జనార్దన్ రెడ్డి జైలులోనే ఉన్నారు. అసోసియేటెడ్ మైనింగ్ కార్పోరేషన్ (ఎఎంసి), డెక్కన్ మైనింగ్ కంపెనీ (డిఎంసి) కేసులో ఆయన ప్రస్తుతం కర్ణాటక రాజధాని బెంగళూర్ జైలులో ఉన్నారు.
బెయిల్ ఇస్తే గాలి జనార్దన్ రెడ్డి సాక్షులను బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేస్తారని సిబిఐ హైకోర్టులో వాదించింది. వాదనలను విన్న హైకోర్టు గాలి జనార్దన్ రెడ్డి బెయిల్‌ను వచ్చే నెల 5వ తేదీ వరకు సస్పెండ్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు గాలి జనార్దన్ రెడ్డి తరఫు న్యాయవాదులను ఆదేశించింది. విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.
ఓఎంసి కేసులో గాలి జనార్దన్ రెడ్డిని, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డిని సిబిఐ అధికారులు సెప్టెంబర్ 5వ తేదీన బళ్లారిలో అరెస్టు చేసి హైదరాబాదుకు తీసుకొచ్చారు. కాగా, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ప్రధాన నిందితుడు బిపి ఆచార్య బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైనందు వల్ల ఆచార్యకు బెయిల్ ఇవ్వకూడదని సిబిఐ వాదించింది.












Click it and Unblock the Notifications