నాకేం తెలియదు: సబ్బం హరి, జగన్‌కు ఇంటి భోజనం

జగన్ విచారణ సమయంలో మీరు మీడియా పాయింట్ వద్ద ఉండగా తాను పైన ఉంటున్నానని, తనకు విచారణ గురించి ఏ విషయాలు తెలియవన్నారు. ఇంకా చెప్పాలంటే నాకంటే మీకే ఎక్కువగా తెలుస్తుందన్నారు. జగన్‌కు ముగ్గురు కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు సంఘీభావం తెలుపుతారని ఆయన అన్నారు.
వారు నేరుగా వచ్చి తెలుపుతారా, ఫోన్‌లో తెలుపుతారా అనేది తనకు తెలియదన్నారు. సంఘీభావం చెప్పేందుకు పలు దారులు ఉన్నాయన్నారు. సంఘీభావం విషయం రేపే తెలుస్తుందన్నారు. కాగా సబ్బం హరి, ఆళ్ల నాని, జూపూడి ప్రభాకర రావు, సంజయ్ కృష్ణ రంగారావు ఉదయం జగన్‌తో పాటు సిబిఐ కార్యాలయానికి వచ్చిన విషయం తెలిసిందే.
తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఎప్పుడు చేరేది త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. సాయంత్రం వరకు విచారణ జరుగుతుందన్నారు. జగన్‌ను విజయ సాయి రెడ్డి, పలువురితో కలిసి సిబిఐ అధికారులు విచారిస్తున్నారన్నారు.
సిబిఐ నాలుగున్నర గంటలుగా జగన్‌ను విచారిస్తోంది. జగన్ అదివారం కూడా ఇంటి నుండే భోజనం తెప్పించుకున్నారు. ఆయన అనుచరులు జగన్ ఇంటి నుండి భోజనాన్ని తీసుకు వచ్చారు. సిబిఐ అరగంట పాటు భోజన విరామం ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ విచారణ ప్రారంభించింది. జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని కూడా సిబిఐ విచారిస్తోంది.












Click it and Unblock the Notifications