భర్తను చంపారు, బిడ్డకు హింస: విజయమ్మ ధర్నా

తన భర్తను చంపారని, తన కుమారుడిని వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఏం తప్పు చేశాడని తన కుమారుడిని అరెస్టు చేశారని ఆమె అడిగారు. ఓదార్పు యాత్ర చేయడమే తప్పా అని ఆమె అడిగారు. మాట నిలబెట్టుకున్నందుకే అరెస్టు చేశారా అని సోనియాను అడుగుతున్నానని ఆమె అన్నారు. ప్రజల ఆదరణ చూసి జగన్‌ను వేధిస్తున్నారని ఆమె అన్నారు.
తన భర్త వైయస్ రాజశేఖర రెడ్డి మరణంపై ఇంకా అనుమానాలున్నాయని ఆమె అన్నారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని ఆమె అడిగారు. వైయస్ జగన్‌ను ఎందుకు సాధిస్తున్నారని ఆమె అడిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జగన్‌ను ఏం చేయదలుచుకున్నాయని ఆమె అడిగారు. సిబిఐకి జగన్ మూడు రోజుల పాటు సహకరించాడని ఆమె చెప్పారు. జగన్‌కు ఒక్కటే వేధింపులు, ఒక్కటే నరకం చూపిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను అరెస్టు చేసి అనారోగ్యం పేరుతో కేర్ ఆస్పత్రిలో పెట్టారని ఆమె ఆరోపించారు. కాంగ్రసు నుంచి కావాలనే వైయస్ జగన్‌ను తప్పించారని ఆమె అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు గుణపాఠం చెప్తారని ఆమె అన్నారు. ప్రజలే న్యాయనిర్ణేతలని ఆమె అన్నారు. చిన్న బిడ్డను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేధిస్తున్నాయని ఆమె అన్నారు. జగన్‌ను ఎందుకిలా వేధిస్తున్నారు. ఏ ఆధారాలు లేకుండా జగన్‌ను అరెస్టు చేశారని ఆమె విమర్శించారు.
వైయస్ విజయమ్మ వెంట జగన్ భార్య భారతి, సోదరి షర్మళ, బావ అనిల్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులున్నారు. వైయస్ విజయమ్మ ధర్నాకు దిగడం అనూహ్యమైన పరిణామమే.












Click it and Unblock the Notifications