మూడంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం

విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది. నాలుగు ఫైరింజన్‌లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భవనం మూడంతస్తులలో ఉంది. వచ్చిన ఫైరింజన్లు అయిదు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగినా ఆర్పగలవు. మంటలు ఆర్పుతుండగా నీరు అయిపోవడంతో జలమండలి నుంచి నీటిని తెప్పించి మంటలను ఆర్పుతున్నారు. అయితే మంటలు ట్రాన్స్‌ఫార్మర్ కారణంగానే చెలరేగాయా మరే కారణమైనా ఉందా అనే విషయం ఖచ్చితంగా తెలియరాలేదు.
కాగా రైల్వే ట్రాక్ కూల్చివేతకు కుట్ర జరిగింది. సిబ్బంది సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. పెద్దపెండ్యాల -నష్కల్ రైల్వే స్టేషన్ల మధ్యన 5 డిటోనేటర్లను రైల్వే సిబ్బంది గుర్తించారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు సికింద్రాబాద్ నుండి భువనేశ్వర్ వెళుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దొంగతనం జరిగింది.
విజయనగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకురాలు సంధ్యారాణికి చెందిన బ్యాగ్‌ను దొంగిలించారు. ఆ బ్యాగులో 12 తులాల బంగారు, రూ.50వేల రూపాయల నగదు ఉన్నట్లు ఆమె తెలిపారు. బంగారు విలువ మూడు లక్షల యాభై వేల రూపాయలకు ఉంటుందని తెలుస్తోంది. రైల్వే పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications