కెవిపి ఇంటిపై దాడికి యత్నం, కోర్టు వద్ద హంగామా

KVP Ramachandar Rao
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మబంధువు కెవిపి రామచంద్ర రావు ఇంటిపై కొందరు దుండగులు దాడికి యత్నించారు. సోమవారం ఉదయం బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంపై కొందరు వ్యక్తులు దాడికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో కెవిపి ఇంటిపై దాడికి యత్నించడం గమనార్హం.

వైయస్ ఆత్మగా పేరుగాంచిన కెవిపి ఆయన మృతి అనంతరం రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఇటీవల కొద్దికాలంగా కాంగ్రెసులో క్రియాశీలంగా పని చేస్తున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో కూడా ఓసారి పాల్గొని వచ్చారు. జగన్‌కు దూరంగా ఉండటంపై దివంగత ముఖ్యమంత్రి వైయస్ అభిమానులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

మరోవైపు వైయస్ జగన్‌ను అరెస్టు చేయడం, నాంపల్లి కోర్టుకు హాజరుపర్చడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ పలువురు అభిమానులు కోర్టు మెయిన్ గేటు వద్దకు చొచ్చుకు వచ్చారు. ఓ అభిమాని చేయి కోసుకున్నాడు. గేటు వద్దకు వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేయి కోసుకున్న వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

చంచల్‌గూడా జైలు వద్ద మధ్యాహ్నం నుంచి బందోబస్తు ఏర్పాట్లు పెంచారు. భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు చంచల్ గూడ వెళ్లే మార్గంలోనూ వాహనాల తనిఖీలు, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో జగన్‌ను జైలుకు తరలించనున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. కాగా జగన్ అరెస్టుకు నిరసనగా జగన్ పార్టీ నేతల రాష్ట్రవ్యాప్త బందులో భాగంగా కడప జిల్లాలో బందు పాటిస్తున్నారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు.

జైలు మార్గంలో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డితో ఇంటలిజెన్స్ చీఫ్ మహేందర్‌ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఉదయం సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ జగన్ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+