హెలికాప్టర్ ప్రమాదం: విజయమ్మపై నేతల ఎదురు దాడి

అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా కాంగ్రెసు పార్టీకి సమానమేనని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై ఆమె ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేయడమేమిటని ప్రశ్నించారు. ఉప ఎన్నికలలో సానుభూతి కోసం, జగన్ అరెస్టుపై ప్రజల మద్దతు కోసమే ఆమె హెలికాప్టర్ ప్రమాదాన్ని ప్రస్తావిస్తోందని ఆరోపించారు. సునీల్ రెడ్డి, శ్రీలక్ష్మి జైలుకు వెళ్లినప్పుడు ఆమెకు గుర్తుకు రాలేదా అన్నారు. జగన్ జైలుకెళ్లాకే అంతా గుర్తుకు వచ్చిందా అన్నారు.
జగన్ అరెస్టుపై నిరసనలు తెలిపేందుకు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు సిగ్గుపడుతున్నారన్నారు. కాంగ్రెసుపై విమర్శిస్తే ఊరుకోం అన్నారు. ఎవరికీ ఇవ్వని అవకాశాలను కాంగ్రెసు వైయస్‌కు ఇచ్చిందన్నారు. సోనియాపై విమర్శలు విజయమ్మకు తగదన్నారు. జగన్ అక్రమాలకు ఆమె మద్దతు పలుకుతున్నట్లుగా ఉందన్నారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదం మూడేళ్ల తర్వాత గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు.
జగన్ కేసులో చట్టం తన పని తాను చేసుకు పోతోందని తులసి రెడ్డి అన్నారు. ప్రభుత్వం గాని, కాంగ్రెసు పార్టీ గానీ జోక్యం చేసుకోదన్నారు. జగన్ ఆస్తులపై సిబిఐ విచారణను విజయమ్మ తప్పు పట్టడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తులపై పిటిషన్ వేసిన విజయమ్మ తన తనయుడిపై మాత్రం విచారణను వ్యతిరేకించడం సరికాదన్నారు. ఆమె పుత్రోత్సాహంతో వాస్తవాలను విస్మరిస్తున్నారని విమర్శించారు. ఆమెది ద్వంద వైఖరి అన్నారు.
2004 ఎన్నికలలో కాంగ్రెసు మేనిఫెస్టో కోసం చాలా కష్టపడ్డామని డి శ్రీనివాస్ అన్నారు. ఆ సంక్షేమ పథకాలు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డివి అని విజయమ్మ చెప్పడం విడ్డూరమన్నారు. అవి కాంగ్రెసు పథకాలే అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేపట్టిన పథకాలు కూడా ఆయనవి కావని, కాంగ్రెసువే అన్నారు.
జగన్ అరెస్టుకు, కాంగ్రెసుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెసు పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది వైయస్ వల్ల మాత్రమే కాదని, లక్షలాది మంది కార్యకర్తల కృషితో అన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు సిబిఐని బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంపై విజయమ్మకు అనుమానాలు ఉంటే నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.












Click it and Unblock the Notifications