ఒక్కొక్కరు పది ఓట్ల వ్యాఖ్యకు సిఎంకు ఈసి నోటీసు

kiran kumar reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం (సిఈసి) నోటీసులు జారీ చేసింది. ఒక్కొక్కరు పది ఓట్లు వేయండంటూ మే 18న అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు గాను ఈసి ఈ నోటీసు ఇచ్చింది. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఈసి తీవ్రంగా పరిగణించింది. మే 31 మధ్యాహ్నం 12 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ దృష్టికి మీడియా ఈ విషయాన్ని తీసుకెళ్ళింది. అంతే అప్పటికప్పుడే ఆయన దీనిపై చర్యలు తీసుకోవాలని పక్కనే ఉన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలరు రికార్డు చేసిన సిడిలను పరిశీలించిన అనంతరం మంగళవారం ఈసి సిఎంకు నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఎన్నికల సంఘం ప్రతినిధులు వెళ్లి నోటీసులు అందించారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యను ఎన్నికల ప్రవర్తనా నియామళికి విరుద్దంగా ఈసి భావించింది.

రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి జూన్ 12వ తేదీన ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు తలమునకలవుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో తెరిపి లేకుండా తిరుగుతూ వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో జైలు పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+