జగన్ కేసు: రంగంలోకి ఈడి, కస్టడీకి నిమ్మగడ్డ ప్రసాద్

YS Jagan-Nimmagadda Prasad
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) రంగంలోకి దిగింది. ఈ కేసులో హైదరాబాద్ విభాగం అధికారులకు సహాయం చేయడానికి ఢిల్లీ నుండి ఓ ఈడి బృందం హైదరాబాదు చేరుకుంది. సోమవారం ఉదయం దిల్‌కుషా అతిథి గృహంలో సిబిఐ బృందంతో భేటీ అయిన ఈడి అధికారులు జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు జగన్ ఆస్తుల కేసులో అరెస్టైన నిమ్మగడ్డ ప్రసాద్‌ను సిబిఐ అధికారులు మంగళవారం ఉదయం తమ కస్టడీకి తీసుకున్నారు. ఆయనను మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు విచారించనున్నారు. జగన్ ఆస్తుల కేసులో వాన్‌పిక్ అంశం ప్రధానమైన విషయం తెలిసిందే. దీంతో ఈ అంశంపై నిమ్మగడ్డ ప్రసాద్‌ను సిబిఐ అధికారులు పదిరోజుల పాటు విచారించారు.

16వ తేదిన సిబిఐ అధికారులు నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను కస్టడీలోకి తీసుకుంది. పదిరోజుల పాటు విచారించిన అనంతరం సోమవారం 28న జగన్‌తో పాటు వీరిని కోర్టులో హాజరుపర్చింది. అనంతరం మరో రెండు రోజుల పాటు తమ కస్టడీకి నిమ్మగడ్డను అప్పగించాలని సిబిఐ కోరింది. కోర్టు అంగీకరించింది. దీంతో మరో రెండు రోజుల పాటు సిబిఐ నిమ్మగడ్డను విచారించనుంది.

పెట్టుబడులు తదితర అంశాలపై మరింత కూపీ లాగనున్నారు. సిబిఐ 25, 26, 27వ తేదీలలో జగన్‌ను విచారించిన విషయం తెలిసిందే. ఈ మూడు రోజులు వారి సమక్షంలోనే కొన్ని గంటలు జగన్‌ను విచారించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఉదయం తొమ్మిది గంటలకు సిబిఐ ప్రసాద్‌ను చంచల్ గూడ జైలు నుండి తమ కస్టడీకి తీసుకుంది. అతనిని దిల్ కుషాకు తరలించింది. కాగా ఈడి జగన్‌ను ఏం అడగనుంది, ఎవరెవరిని విచారించనుందనే చర్చ ప్రారంభమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+