లగడపాటి రిసార్ట్స్‌లో పేలుడు: నలుగురి అరెస్టు

గతంలో తెల్లాపూర్ రైల్వే వంతెన కింద బాంబులు పెట్టింది కూడా ఈ నలుగురేనని పోలీసులు అంటున్నారు. తమకు అందిన సమాచారంతో రైల్వే పోలీసులు బాంబులను గుర్తించి వెలికి తీసి నిర్వీర్యం చేశారు. దాంతో పెద్ద ముప్పు తప్పింది. ఈ సంఘటనకు తామే పాల్పడినట్లు చెబుతూ అప్పట్లో వీరు ముసుగులు వేసుకుని ఉన్న సిడిని టీవీ చానెళ్లకు పంపించారు. దాని ఆధారంగా పోలీసులు ఈ నలుగురిని గుర్తించి పట్టుకున్నారు.
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ఓ రిసార్ట్‌లో పేలుళ్లు సంభవించాయి. హైదరాబాదులోని కొండాపూర్‌లో గల ప్లాసిడా రిసార్టులో ఈ పేలుళ్లు శనివారమే జరిగాయని తెలుస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు ప్రచారం నేపథ్యంలో మరింత ఉద్రిక్తత తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు పేలుళ్ల విషయాన్ని గోప్యంగా ఉంచినట్లుగా తెలుస్తోంది.
ప్లాసిడా రిసార్ట్‌ను లగడపాటి సతీమణి పద్మ నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే రెండు నెలలుగా ఇది వాడుకలో లేదు. కేవలం వాచ్‌మెన్ మాత్రమే అందులో నివాసం ఉంటున్నారు. గత వారం శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రిసార్టులో ఒక్కసారిగా జిలెటిన్ పేలుళ్లు జరిగాయి. ఈ విషయాన్ని వాచ్‌మెన్ పోలీసులకు చెప్పారు.
జిలెటిన్ పేలుళ్ల కారణంగా ప్లాసిడా రిసార్ట్ పాక్షికంగా దెబ్బతిన్నది. సంఘటన స్థలంలో తెలంగాణవాదుల పేరిట కరపత్రాలు దొరికాయి. దీనిపై రాయదుర్గం పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం ఘటన జరిగినప్పటికీ మరిన్ని సంఘటనలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు దానిని గోప్యంగా ఉంచారు.
తన ప్లాసిడా రెస్టారెంట్‌లో జిలెటిన్ పేలుళ్లపై రాజమండ్రిలో ఉన్న లగడపాటి రాజగోపాల్ మంగళవారం స్పందించారు. తన రిసార్టులో పేలుళ్లకు కారణం తెలంగాణవాదులు కాదని, వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గీయులే అని అనుమానం వ్యక్తం చేశారు. తాను మొదటి నుండి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని, కానీ ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. తెలంగాణవాదులే చేయాలనుకుంటే ఎప్పుడో చేసే వారన్నారు. అయితే పోలీసుల విచారణలో పూర్తి విషయాలు వెల్లడవుతాయన్నారు.
ఒకవేళ తెలంగాణవాదులే చేస్తే వారి సాహిత్యం అక్కడ ఎందుకు వదిలి వెళతారన్నారు. తెలంగాణవాదుల పైకి దీనిని నెట్టేందుకే జగన్ వర్గీయులు ఇలా చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో దాడులు జరిగినా ఇంత విధ్వంసంగా లేవన్నారు. తన రిసార్టుపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణవాదులకు ఆ అవసరం లేదని చెప్పారు. తనకు కూడా పేలుళ్ల విషయం ఆలస్యంగా తెలిసిందన్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications