హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు అచ్చిరాని మే 28: ఆనాడు అలా, నేడు ఇలా

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్‌సభ సభ్యుడు వైయస్ జగన్మోహనరెడ్డికి మే 28వ తేదీ అచ్చివచ్చినట్లు లేదు. మే 28వ తేదీ జగన్‌కు కలిసి వస్తున్నట్లు లేదని జగన్ ఆయన వర్గానికి చెందిన నాయకులు అంటున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైయస్ జగన్ 2010 మే 28వ తేదీన వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో ఓదార్పు యాత్రను తలపెట్టారు.

మహబూబాబాద్ ఓదార్పు యాత్ర ఆయనకు గండంగా మారింది. 2010 మే 28వ తేదీన సికింద్రాబాద్ నుంచి ఇంటర్‌సిటీ రైలులో మహబూబాబాద్‌కు బయలు దేరిన జగన్మోహనరెడ్డికి తెలంగాణ ఆందోళనకారులు నుంచి నిరసనలు ఎదురయ్యాయి. ఈ పరిస్థితిలో జగన్ మహబూబాబాద్‌కు వస్తే గొడవలు జరుగుతాయని పోలీసులు భావించారు. దీంతోమార్గం మధ్యలోనే ఆలేరు రైల్వే స్టేషన్‌లో ఆయనను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకు వచ్చారు.

అదే రోజు మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో జగన్ వర్గీయులకు, తెలంగాణ ఆందోళనకారులకు మధ్య అల్లర్లు జరిగాయి. ఆ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది గాయపడ్డారు. మహబూబాబాద్ చేరుకోకుండానే ఆయన ఓదార్పు యాత్ర అప్పుడ అర్థాంతరంగా ముగిసింది. అది జగన్‌కు ఓ చేదు అనుభవంగానే మిగిలిపోయింది.

కాగా, అక్రమ అస్తుల కేసులో మూడు రోజుల పాటు సిబిఐ అధికారులు విచారించిన అనంతరం ఆదివారం రాత్రి జగన్‌ను అరెస్టు చేశారు. సోమవారం ఉదయం మే 28వ తేదీన సిబిఐ కోర్టులో జగన్‌ను హాజరు పరచగా ఆయనకు బెయిల్‌ను తిరస్కరిస్తూ జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది. దీంతో జగన్‌ను చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఇలా మే 28 తేదీ రెండుసార్లు ఆయనకు చేదు అనుభవాన్నే మిగిల్చింది.

English summary
Earlier YSR Congress party president YS Jagan could not take up Odarpu yatra at Mahaboobabad of Warangal district on May 28, 2010. Now on May 28 he was jailed in assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X