జగన్, రాహుల్‌గాంధీ: వైయస్ విజయమ్మ ప్రచారాస్త్రాలు

YS Vijayamma
హైదరాబాద్: త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ బుధవారం నుండి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అయితే ఉప ఎన్నికలలో ఈమె ఏ అంశాలపై మాట్లాడతారనే చర్చ జరుగుతోంది. అమె ప్రధానంగా రెండు అంశాలను ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఒకటి పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు కాగా రెండోది ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ. రెండు రోజుల క్రితం వైయస్ జగన్ అరెస్టయిన విషయం తెలిసిందే. కాంగ్రెసు పార్టీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అందులో భాగమే తన తనయుడు జగన్ అరెస్టని ఆమె ప్రజల్లోకి వెళ్లనున్నారు. వైయస్ మృతి తర్వాత తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆమె ప్రజలకు వివరించనున్నారు.

అదే సమయంలో రాహుల్ గాంధీ అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి యువనేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలనే లక్ష్యంతో పని చేశారని, అందులో భాగంగా 2014 ఎన్నికలలో రాష్ట్రంలో 41 పార్లమెంటు స్థానాల గెలుపు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారని, కానీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మాత్రం రాహుల్ కోసం పాటుపడిన వైయస్ కుటుంబం పట్ల మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా నడుచుకుంటున్నారని చెప్పనున్నారు.

రాహుల్ కోసం వైయస్ పాటుపడితే అదే వైయస్ తనయుడిని కాంగ్రెసు ఇబ్బందుల పాలు చేస్తోందని ఆమె ప్రజల్లోకి తీసుకు వెళ్లనున్నారు. స్థానిక సమస్యలు, వైయస్ హయాం ఆ తర్వాత పాలనకు తేడా, వైయస్ సంక్షేమ పథకాలను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విస్మరిస్తోందని ఆమె ప్రచారంలో ప్రస్తావించనున్నారు. వీటితో పాటు ముఖ్యంగా జగన్ అరెస్టు, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న వైయస్ ఆకాంక్షను మరింతగా ఆమె ప్రజల్లోకి తీసుకు వెళ్లనున్నారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+