ప్రాణాలు తీసిన బంద్, జగన్ పార్టీ కార్యకర్తల దాష్టీకం?

ఓ ప్రైవేట్ బస్సుపై దాడి ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళుతున్న కావేరీ ట్రావెల్స్ బస్సు శేరిగూడకు చేరగానే కొందరు వ్యక్తులు రాళ్లతో దాడికి దిగారు. బస్సు అద్దాలు పగిలి డ్రైవర్ ఆంజనేయులు కళ్లలో గుచ్చుకున్నాయి. దీంతో అదుపు తప్పిన బస్సు మొదట ఓ చెట్టును, తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ బస్సును అదుపుచేసే ప్రయత్నంలో అదనపు డ్రైవర్ నాగగోపాల్ రావు కూడా తీవ్రంగా గాయపడి బస్సులోనుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆ సమయంలో బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నారు. నాగగోపాల్ బస్సును అదుపు చేయకపోతే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఇదే ప్రాంతంలో మరో రెండు వాహనాలపైనా దాడులు జరగడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలే ఈ పని చేశారని పోలీసులు అనుమానించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాగార్జునసాగర్ రహదారిపై వెళ్తున్న ఈ బస్సుపై మంగలపల్లి గేట్ సమీపంలో శ్రీ ఇందు కళాశాల వద్ద ఈ బస్సుపై రాళ్లతో దాడి చేశారు. గోపి మృతిచెందగా మరో డ్రైవర్ ఆంజనేయులు గాయాలపాలయ్యాడు. అనంతరం పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు పదిహేను మంది విధ్వంసానికి పాల్పడ్డారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications