కొడుకు కోసమే రోడ్డెక్కారు: వైయస్ విజయమ్మపై డిఎస్

జగన్ ఆస్తుల కేసు విచారణ అంతా కోర్టు పరిధిలోనే జరుగుతోందన్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెసుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై ఎలాంటి కుట్ర చేయాల్సిన అవసరం లేదన్నారు. వైయస్‌కు చెడ్డపేరు రాకుండా ఉండాలనే తాను, పార్టీ కోరుకుంటోందన్నారు. ఆయన మరణానంతరం చెడ్డపేరు రావడం ఇష్టం లేదన్నారు.
విచారణలో వాస్తవాలు బయటకొస్తాయన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుతో ఎలాంటి సానుభూతి ఉండదన్నారు. ఉప ఎన్నికలలో ఓట్ల కోసమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తమ పార్టీని విమర్శిస్తున్నారని పాలడుగు వెంకట్రావు హైదరాబాదులో అన్నారు. జగన్ విషయంలో కాంగ్రెసు పార్టీయే అంతా చేసిందని అందరినీ నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని చెప్పారు.
వైయస్ విజయమ్మ ఉప ఎన్నికల బాధ్యతలు స్వీకరిస్తే భూమి ఆకాశాలు బద్దలవుతాయని, సునామీ వస్తుందన్న లెవల్లో జగన్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని తులసి రెడ్డి వేరుగా మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు చేసింది త్యాగం చేసింది రైతుల కోసం కాదని, జగన్ కోసమని విజయమ్మ చెప్పకనే చెప్పారన్నారు. జగన్ కోసం త్యాగం చేసిన వారిని గెలిపించాలని విజయమ్మ బయట పెట్టారన్నారు.
వారంతా జగన్‌కు అమ్ముడు పోయారని, అవిస్వాస తీర్మానం సమయంలో పార్టీ విప్ ధిక్కరించిన వాళ్లు త్యాగధనులు కాదని, భోగదనులు అన్నారు. వారో అమ్ముడుపోయిన అంగడి సరుకు అన్నారు. కాగా కేంద్రమంత్రి పురంధేశ్వరి జూన్ 1వ తేది నుండి 9వ తేది వరకు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అమె ప్రచార షెడ్యూల్ విడుదలయింది. జూన్ 1న ఆళ్లగడ్డ, 2న రైల్వే కోడూరు, 3న రామచంద్రాపురం, 4న ఒంగోలు, 5, 6న నెల్లూరు, 7న ప్రత్తిపాడు, 8న నర్సన్నపేట, 9న పాయకరావుపేటలలో పురంధేశ్వరి ప్రచారం నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications