జగన్ అపచారంపై విహెచ్ మౌనదీక్ష: భగ్నం, అరెస్టు

V Hanumantha Rao
హైదరాబాద్: తిరుమలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అపచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు గురువారం ఉదయం తిరుపతిలో తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. విహెచ్ అనుచరులు కృష్ణాపురం ఠానా వద్ద వేసిన టెంట్‌ను పోలీసులు తొలగించారు. ఈ సమయంలో పోలీసులకు, విహెచ్ అనుచరులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

టెంట్ తొలగించి, వి హనుమంతరావు దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఎంఆర్ పల్లి స్టేషన్ వద్ద మౌన దీక్ష చేస్తానని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున మౌనదీక్షకు అనుమతించేది లేదని పోలీసులు విహెచ్‌కు చెప్పారు. పోలీసు స్టేషన్‌లో ఆయన దీక్షను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

బెయిల్ ఇవ్వడానికి పోలీసులు అధికారులు సిద్ధపడినా వి హనుమంతరావు అందుకు నిరాకరించారు. జగన్ అపచారం వల్ల ఆయన వర్గానికి ఎదురు దెబ్బలు తగలకూడదని తాను మౌన దీక్షకు పూనుకున్నట్లు వి. హనుమంత రావు చెప్పారు. వైయస్ జగన్‌పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ వెంట ఉన్న యువత మంగలి కృష్ణ, భాను కిరణ్ వంటివారేనని ఆయన అన్నారు.

వైయస్ జగన్ వల్ల పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లారని ఆయన విమర్శించారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు. కుమారుడు జైలుకు వెళ్తే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ - శ్రీలక్ష్మి, నిమ్మగడ్డ ప్రసాద్ జైలుకు వెళ్తే పరామర్శించలేదని ఆయన అన్నారు. తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం చేయకుండా వైయస్ జగన్ ఆ మధ్య శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడంపై దుమారం చెలరేగింది. అలాగే, జగన్ అనుచరులు తిరుమలలో జై జగన్ అంటూ నినాదాలు చేశారని ఆరోపణలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+