రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయమ్మ, షర్మిళ బ్యాగులు రెండుసార్లు తనిఖీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma - Sharmila
రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయలక్ష్మి, ఆమె కూతురు షర్మిళ బ్యాగేజ్‌ని పోలీసులు చెక్ పాయింట్ వద్ద చెక్ చేశారు. శుక్రవారం రామచంద్రాపురంలో ప్రచారం ముగించుకొని నరసాపురం వెళుతున్న విజయలక్ష్మి, షర్మిళ కాన్వాయ్‌ని పోలీసులు దిండి చెక్ పోస్టు వద్ద ఆపారు. వారి బ్యాగులను చెక్ చేశారు. తమ బ్యాగులను చెక్ చేయడంపై విజయలక్ష్మి పోలీసులను ప్రశ్నించింది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు పోలీసులను నిలదీశారు. వాగ్వాదానికి దిగారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ఉద్దేశ్య పూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం వారిపై కక్ష సాధిస్తోందని, ఇందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు తదితరుల వాహనాలను ఎందుకు చెక్ చేయడం లేదని వారు ప్రశ్నించారు. కాగా రోజూ వారి చర్యల్లో భాగంగానే తాము విజయలక్ష్మి బ్యాగేజిని చెక్ చేశాకమని డిఎస్పీ చెప్పారు.

చెక్కింగులో తమకు ఏమీ లభించలేదని, దీంతో వారిని ముందుకు సాగేందుకు అనుమతించామని చెప్పారు. కాగా తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి బ్యాగేజ్ తనిఖీ వెనుక కుట్ర ఉందని వైయస్సార్ కాంగ్రెసు ఆరోపించింది. విజయమ్మ, షర్మిల బ్యాగేజ్‌లను పలు చెక్ పాయింట్ల వద్ద తనిఖీ చేస్తున్నారని, మహిళా పోలీసులు చెక్ చేయడం లేదని వారు ఆరోపించారు. గురువారం, శుక్రవారం వరుసగా రెండు రోజులు తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలి బ్యాగులు తనిఖీ చేశారన్నారు.

అదే సమయంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లలో తనిఖీలే చేయలేదన్నారు. విజయమ్మ లగేజ్‌ని మొదట రామచంద్రాపురం బైపాస్ రోడ్డులోని కొంగోడు చెక్ పోస్టు వద్ద, ఆ తర్వాత శుక్రవారం దిండి వద్ద చెక్ చేశారని ఆరోపించారు.

English summary
YSR Congress honorary president Y.S. Vijayalakshmi’s convoy was stopped by the police at Dindi checkpost on Friday and her baggage checked when she was proceeding towards Narasapuram in East Godavari. Ms Vijayalakshmi had just finished campaigning at Ramachandrapuram in East Godavari when her convoy was stopped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X