నోరు విప్పని వైయస్ జగన్: వ్యూహం మార్చిన సిబిఐ

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే విషయంలో సిబిఐ వ్యూహం మార్చింది. అయినప్పటికీ జగన్ నుంచి సిబిఐ పెద్దగా సమాచారమేదీ రాబట్టలేకపోయినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్‌ను సోమవారం సిబిఐ వరుసగా రెండో రోజు ప్రశ్నించింది. విచారణ ముగిసిన తర్వాత వైయస్ జగన్‌ను సిబిఐ చంచల్‌గుడా జైలుకు తరలించింది. మరో మూడు రోజుల పాటు జగన్‌ను సిబిఐ అధికారులు విచారించనున్నారు.

సోమవారం రెండో రోజు సిబిఐ అధికారులు వైయస్ జగన్‌ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినట్లు తెలుస్తోంది. అయితే, తనకు ఏ విషయూలూ తెలియవని, తాను ఏ విధమైన అక్రమాలకు పాల్పడలేదని మాత్రమే వైయస్ జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. తాము స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను ముందు పెట్టినప్పటికీ వైయస్ జగన్ ఏ విషయాలూ చెప్పలేదని అంటున్నారు.

సిబిఐ జాయింట్ డైరెక్టర్ (జెడి) లక్ష్మీనారాయణ, ఎస్పీ వెంకటేష్‌లతో పాటు బెంగళూర్ నుంచి వచ్చిన సిబిఐ అధికారులు వైయస్ జగన్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆదివారంనాడు సిబిఐ అధికారులు వైయస్ జగన్‌ను జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రెండో రోజు వాటితో పాటు విదేశీ పెట్టుబడలపై, జగతిలోకి విదేశీ నిధుల మళ్లింపుపై సిబిఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.

సిబిఐ అధికారులు సోమవారం జగన్‌ను ఆరున్నర గంటల పాటు విచారించారు. అయినప్పటికీ కావాల్సిన సమాచారాన్ని రాబట్టలేకపోయారని అంటున్నారు. విచారణ కేంద్రా న్ని కోఠిలోని సీబీఐ కార్యాలయానికి మార్చారు. మొదటిరోజు ఆదివారం జగన్‌ను చంచల్‌గూడ జైలుకి సమీపంలోని జైళ్ళశాఖ డీజీ కార్యాలయంలో విచారించడం తెలిసిందే. అయితే భద్రతా కారణాలతో పాటు జైళ్ళ శాఖ కార్యాలయంలో రోజూవారీ కార్యకలాపాలకు ఆటంకం కలుగకుండా విచారణ కేంద్రాన్ని మార్పు చేసినట్లు తెలుస్తోంది. అలాగే భద్రతా కారణాల దృష్ట్యా జగన్‌కు బులెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారు.

సోమవారం ఉదయం జగన్‌ను విచారణకు తరలిస్తున్న క్రమంలో కొంతసేపు ట్రాఫిక్‌జామ్ చోటు చేసుకుంది. నల్లగొండ చౌరస్తాలో నిలిచిపోయిన ట్రాఫిక్‌లో సిబిఐ వాహనశ్రేణి చిక్కుకుపోయింది. దీనితో కాస్త ఆలస్యంగా జగన్‌ను కోఠి కార్యాలయానికి తరలించారు. మొత్తం మీద 11 గంటల ప్రాంతంలో జగన్ విచారణ ప్రారంభమైంది. జగన్ విచారణ నేపథ్యంలో కోఠి ప్రాంతంలో కూడా ట్రాఫిక్‌జామ్ నెలకొంది.

వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్‌పై వాదనలు సోమవారం పూర్తయ్యాయి. తన నిర్ణయాన్ని కోర్టు రేపటికి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+