మళ్లీ మార్పు: బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్లో జగన్ తరలింపు

అయితే సోమవారం మరోసారి జగన్ విచారణ స్థలాన్ని అధికారులు మార్చారు. సోమవారం నుండి జగన్‌ను కోఠిలోని సిబిఐ కార్యాలయంలోనే విచారించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా జైళ్ల శాఖ డిజి కార్యాలయంలో విచారించడం వల్ల విచారణకు అవసరమైన ఫైళ్లను అంత వరకు మోసుకెళ్లడం మధ్యలో ఏదైనా సమాచారం కావాలంటే ఇబ్బంది కలగడం తదితర కారణాలతో కోఠిలోనే విచారించేందుకు సిబిఐ ఈ మార్పు చేసినట్లుగా తెలుస్తోంది.
ఉదయం పదిగంటలకు సిబిఐ అధికారులు చంచల్‌గూడ జైలుకు వెళ్లి జగన్‌ను తమ కస్టడీకి తీసుకున్నారు. ఆయన కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏర్పాటు చేశారు. బుల్లెట్ ప్రూప్ వాహనంలోనే జగన్‌ను కోఠి కార్యాలయానికి తరలించారు. పదిన్నర గంటలకు విచారణను ప్రారంభించారు.
ఇందు కోసం కోఠి సిబిఐ కార్యాలయంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్‌ను ఐదు రోజుల పాటు సిబిఐ కస్టడీకి కోర్టు శనివారం అప్పగిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఆదివారం నుండి గురువారం వరకు ఐదు రోజుల పాటు జగన్‌ను అధికారులు విచారిస్తారు. సోమవారం రెండో రోజు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications