ఎస్సెమ్మెస్ చేస్తే 500రీచార్జ్: జగన్‌పార్టీపై ఈసికి కాంగ్రెస్

ఓటర్లను కించపర్చే విధంగా సాక్షి మీడియాలో ప్రసారం చేస్తున్న అసత్యాలపై చర్యలు తీసుకోవాలని వారు భన్వర్ లాల్‌కు విజ్ఞప్తి చేశారు. సాక్షి మీడియాలో నిత్యం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా వార్తలు వస్తున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కాగా ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఒకరిపై మరొకరు ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే.
ఇటీవల నందమూరి బాలకృష్ణ అధినాయకుడు చిత్రంలో ఒక పార్టీకి అనుకూలంగా డైలాగులు ఉన్నాయని, ఆ చిత్రం విడుదలను ప్రస్తుతానికి నిలిపి వేయాలని, ఉప ఎన్నికలు పూర్తయ్యాక విడుదలకు అనుమతించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఈసికి ఫిర్యాదు చేసింది. అయితే ఈసి మాత్రం అధినాయకుడు చిత్రం విడుదలను ఆపలేమని తేల్చి చెప్పింది. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా సాక్షి మీడియాలో ఇరవై నాలుగు గంటలు జగన్ పార్టీ అభ్యర్థుల వార్తలే వస్తున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
కాగా ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఒక్కొక్కరు పది ఓట్లు వేయాలని చేసిన కామెంట్లకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. దానిపై సిఎం వివరణ ఇచ్చుకున్నారు. కిరణ్‌కు ఈసి రెండుసార్లు నోటీసులు జారీ చేయగా, ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా మతపరమైన వ్యాఖ్యలు చేశారని ఈసి నోటీసులు పంపించింది. కెసిఆర్ వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications