ఎటు చూసినా ఇద్దరే, తెగలరా: తెరాసపై జవదేకర్ వ్యాఖ్య

Prakash Javadekar
హైదరాబాద్/వరంగల్: అటునుంచి ఇటు... ఇటునుంచి అటు లెక్కేసినా ఇద్దరంటే ఇద్దరు ఎంపీలున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తెలంగాణ తేగలదా? అని బిజెపి పార్లమెంటు సభ్యుడు, పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ అడిగారు. అదో ఉప ప్రాంతీయ పార్టీ అని, జాతీయ స్థాయిలో అదేం పోరాడగలదని ఆయన అన్నారు. తెలంగాణ తేవడం దానికి సాధ్యమేనా? ఎంతమాత్రం కాదుని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు నెలల్లో తెలంగాణ వచ్చేస్తుందని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అలాంటి భరోసా కాంగ్రెస్‌కే లేదని, ఇక తెరాసకు ఎక్కడిదని ఆయన అన్నారు.

ఆదివారం వరంగల్ జిల్లా పరకాల ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా హన్మకొండలో, తర్వాత హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పూటకో నాటకమాడే కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం తెలంగాణ వచ్చే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. కేంద్ర హోంమంత్రి చిదంబరం 2009 డిసెంబర్‌లో ప్రకటన చేసి తర్వాత వెనక్కిపోవడం డ్రామా కాదా? అని ఆయన అడిగారు. మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తామని తాము లోగడ మాటిచ్చామని, ఎన్డీయే అధికారంలోకి రాగానే తమ వాగ్దానం నిలబెట్టుకున్నామని, ఇప్పుడు తెలంగాణ ఇస్తామని హామీ ఇస్తున్నామని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసి తీరుతాని ఆయన నమ్మబలికారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై క్విడ్ ప్రొ కో ఆరోపణలమీద సిబిఐతో విచారణ జరిపించాలనే తెరాస డిమాండ్‌పై ఆయన స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటుతో క్విడ్ ప్రొకోకు పాల్పడిన తెరాస ఎమ్మెల్యేలపై ముందుగా విచారణ జరపాలని ఆయన అన్నారు. కిషన్‌రెడ్డిని వేలెత్తిచూపే అర్హత ఆ పార్టీ నాయకులకు లేదని ఆయన అన్నారు.

తమకు ఏంకావాలో తాము చెబుతామని, తాము ఏం చెబుతామో అది చేసి చూపుతామని ప్రకటించారు. అనంతరం హైదరాబాద్‌లో బిజెపి మరాఠీ సెల్ నిర్వహించిన ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఉత్తమ పాలనకు శివాజీ మారుపేరుగా నిలిచారని కొనియాడారు. తెలంగాణపై రాజ్యసభలో పెట్టిన ప్రైవేటు బిల్లుపై జూలై 1 నుంచి మరో 3 రోజులపాటు మళ్లీ చర్చ జరుగుతుందని తెలిపారు. ఇక జగన్‌ విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా - వైయస్ అక్రమాల గురించి కాంగ్రెస్‌కు జగన్ బయటకెళ్లాకే తెలిసిందా? అని అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+