జగన్ ఫ్రీడం ఫైటరా: డిప్యూటీ సిఎం, కాన్వాయ్ తనిఖీ

కాంగ్రెస్‌కి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు వలస పోయినా ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని చెప్పారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి బెయిల్ మంజూరు విషయంలో జడ్జి వ్యవహరించిన తీరు విచారకరమని దామోదర అన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు ఇంకా నమ్మకం ఉందన్నారు. కానీ ఇలాంటి సంఘటనల వల్ల అది పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గాలి బెయిల్ వ్యవహారంలో మంత్రి పాత్రపైనా విచారణ జరగాలని, అప్పుడే వాస్తవాలు బయటపడతాయని రాజనర్సింహ అభిప్రాయపడ్డారు.
కాగా డిప్యూటీ ముఖ్యమంత్రి రాజనర్సింహ వాహనాన్ని విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత గ్రామం పరిధిలో ఉన్న టోల్‌గేట్ వద్ద సిఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీ చేశారు. ఉప ఎన్నికల నేపథ్యంలో 24 గంటలూ ఇక్కడ సిఐఎస్ఎఫ్ సిబ్బంది వచ్చేపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆదివారం పాయకరావుపేటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు విశాఖ నుంచి డిప్యూటీ సిఎం తన వాహనంలో వెళుతుండగా తనిఖీ చేశారు. ఉపముఖ్యమంత్రి కాన్వాయ్ అయినా.. నిబంధనల ప్రకారమే వ్యవహరించారు.
ఇప్పటికైనా చేసిన తప్పులను విచారణలో ఒప్పుకొని, వేల కోట్ల రూపాయలు ఎక్కడున్నా యో చెప్పి పునీతుడు కావాలని జగన్‌కు కాంగ్రెస్ ఎమ్మె ల్సీ పాలడుగు వెంకట్రావు సూచించారు. లేకుంటే జగన్ చరిత్రలో హీనుడిగా మిగిలిపోతాడని వ్యాఖ్యానించారు. ఆదివారం సిఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.
జగన్ ఆర్థిక నేరాలపై తగిన సమాచారంతోనే ఈడి రంగంలోకి దిగిందని గుర్తు చేశారు. ఇంటర్‌పోల్ జగన్‌ను అడిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను విమర్శిస్తున్న చంద్రబాబు పవిత్రత ఏంటని ప్రశ్నించారు. ఆర్థిక నేరాల విషయంలో ఆయన పట్టుబడాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications