చెప్పినా జగన్ వినలేదు: పురంధేశ్వరి, మొండిఘటాన్ని

Purandeswari
ఒంగోలు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లినందున తాను ఓ మహిళగా ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ బాధను అర్థం చేసుకున్నానని, అయితే జగన్ అవినీతి కారణంగా జైలుకెళ్లిన వారి గురించి ఆమె ఏనాడైనా ఆలోచించారా అని కేంద్ర సహాయ మంత్రి పురంధేశ్వరి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌తో కలిసి ఆమె ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

తాము అనూహ్య పరిస్థితులలో మీ ముందుకు వచ్చామని ఓటర్లను ఉద్దేశించి అన్నారు. పిసినారిని డబ్బుతో, మొండి ఘటాన్ని నమస్కారంతో, మూర్ఖుడికి చెంపపెట్టుతో బుద్ధి చెప్పాలని, విజ్ఞులకు మాత్రం మాటలతో చెబితే సరిపోతుందని పురంధేశ్వరి ఓ సామెతను వినిపించారు. ఒంగోలువాసులే కాకుండా రాష్ట్ర ప్రజలు విజ్ఞులని మీరు యదార్థాన్ని పరిశీలించి ఓటు వేయాలని కోరారు. పూర్తిగా విశ్లేషించి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి అవినీతికి, స్వార్థపోరుకు మధ్య జరుగుతున్న ఉప ఎన్నికలు అన్నారు. ఓదార్పుకు సహకరిస్తామని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ.. జగన్‌కు హామీ ఇచ్చారని, కానీ రాజకీయం మాత్రం చేయవద్దని సూచించినప్పటికీ వినలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని రెండుసార్లు సిఎల్పీ నేతగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసింది కాంగ్రెస్సే అన్నారు. వైయస్ పైన కాంగ్రెసుకు అభిమానం ఉంది కాబట్టే కడపకు ఆయన పేరు పెట్టిందన్నారు.

తన తండ్రి నందమూరి తారక రామారావు పేరును కృష్ణా జిల్లా పేరు మాత్రం తెలుగుదేశం పార్టీ పెట్టలేక పోయిందన్నారు. జగన్ వల్ల మంత్రులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలుకెళ్లారని, విజయమ్మ ఏనాడైనా వారిని పరామర్శించారా అని అడిగారు. వైయస్ కుటుంబాన్ని కాంగ్రెసు పార్టీ ఏనాడు నిర్లక్ష్యం చేయలేదని, వారి కుటుంబానికి మంచి ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. మాగుంట పార్వతమ్మకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఒక వ్యక్తి స్వార్థం వల్లనే ఎన్నికలు వచ్చాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఒక వ్యక్తి ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. జగన్ అరెస్టుకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. జగన్ ప్రజా సమస్యలపై జైలుకు వెళ్లలేదన్నారు. ఆర్థిక నేరాలు, అవినీతి వల్ల వెళ్లాడన్నారు. పార్టీ ఫిరాయింపులు త్యాగం అవుతుందా అని ప్రశ్నించారు. విజయమ్మ, షర్మిల అన్యాయం చేశారని చెబుతున్నారని, కాంగ్రెసు ఏం అన్యాయం చేసిందో చెప్పాలన్నారు.

మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసులో జగన్‌పై వైయస్ సిబిఐ విచారణ జరిపించినప్పుడు కాంగ్రెసు తమపై కుట్ర పన్నుతుందని ఎందుకు అడగలేదన్నారు. తెలుగుదేశం, మిగతా ప్రతిపక్షాలతో కలిసి కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మాగుంట పార్వతమ్మకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+