బాబు దొంగ, దర్జాగా తిరుగుతున్నాడు: లక్ష్మీపార్వతి

చంద్రబాబును మించిన అవినీతిపరుడు ఇంకెవరూ లేరని ఆమె అన్నారు. తన కేసులపై విచారణ జరగకుండా పోలీసులను, కోర్టులను కూడా అడ్డుగోల సమర్థుడు చంద్రబాబు అని ఆమె అన్నారు. కాంగ్రెసు పార్టీ కక్ష సాధింపుతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను వేధింపులకు గురి చేస్తోందని ఆమె ఆరోపించారు. ఎన్టీఆర్ తర్వాత ప్రజల్లో చరిష్మా ఉన్న నాయకుడు వైయస్ జగన్ మాత్రమేనని ఆమె అన్నారు.
తనపై తప్పుడు వార్తా కథనాలను ప్రసారం చేసిన ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి, ఈటివి -2 టీవీ చానెళ్లపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు రాయదుర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాయదుర్గం అభ్యర్థి కాపు రామచంద్రా రెడ్డి తెలిపారు. ప్రజల్లో తమ పార్టీకి లభిస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఎల్లో మీడియా విషం కక్కుతోందని ఆయన అన్నారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఎఎంసి కేసులో కాపు రామచంద్రా రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకున్నట్లు వార్తాకథనాలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications