అమెరికా విమాన ప్రయాణంలో ఎన్టీఆర్ బంధువు మృతి

ఉక్రెయిన్ సమీపంలోకి వెళ్లేసరికి పూర్ణచంద్ర రావుకు తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. విమానాన్ని ఉక్రెయిన్‌లో అత్యవసరంగా నిలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతను మరణించినట్లు ధ్రువీకరించారు. అయితే బ్రిటిష్ ఎయిర్ వేస్ మాత్రం తమ ప్రయాణీకుడిని గమ్యస్థానానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని చెప్పి మృతదేహంతో బయలుదేరింది. విమానం చేరాల్సిన సమయం ఆలస్యమవటంతో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో విమానాన్ని దించి మృతదేహాన్ని కార్గోలో లండన్‌కు తరలించారు.
తాము 8వ తేది మధ్యాహ్నం 12 గంటలకు లండన్ చేరుకోగా మృతదేహంతో పాటు తమను కూడా భారత్‌కు తిప్పి పంపిస్తామని మొదట చెప్పారని, కానీ ఆ తర్వాత ప్రయాణీకుడు ఉక్రెయిన్ ప్రాంతంలో మృతి చెందడం వల్ల చట్టపరమైన ఇబ్బందులున్నాయని, మృతదేహాన్ని తామే భారత్‌కు పంపిస్తామని చెప్పి, తమను అదే రోజు మధ్యాహ్నం వెనక్కి పంపారని బంధువులు చెప్పారు. ఇప్పటికీ కుంటిసాకులు చెబుతూ తమను మానసికంగా వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో కేంద్రమంత్రి పురంధేశ్వరి, బాలకృష్ణలు సైతం లండన్‌లోని భారత హైకమిషనర్‌తో మాట్లాడారని చెప్పారు. లండన్ తెలుగు సంఘం అధ్యక్షుడు డాక్టర్ రాములు సైతం సంప్రదింపులు జరుపుతున్నారని అయినా ఫలితం లేదని వాపోయారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు కోరారు. కాగా పూర్ణ చంద్రరావు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఎస్టేట్స్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications