జగన్ వైపు వెళ్లే వారు కళ్లు తెరుస్తారు: చీఫ్ విప్ గండ్ర

ఉప ఎన్నికలలో వైయస్ జగన్, ఆయన పార్టీ నేతలు చేసిన అసత్య ప్రచారాలను సమర్థవంతంగా తిప్పి కొట్టగలిగామని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ గుంటూరు జిల్లాలో అన్నారు. ఉప ఎన్నికలతో ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదన్నారు. ఉప ఎన్నికలు జరిగిన పద్దెనిమది అసెంబ్లీ నియోజకవర్గాలలో మెజార్టీ స్థానాలను తాము గెలుచుకుంటామని చెప్పారు.
ఉప ఎన్నికలు పార్టీకి వ్యక్తిగతంగా తనకు మంచి గుణపాఠం అని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అన్నారు. పనులు చేసే వారికి ఓటర్లు ఓటు వేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి బలంగా లేకపోవడం వల్లనే బాగా వెనుకబడ్డామని ఆయన అభిప్రాయపడ్డారు.
న్యాయస్థానాన్ని కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని పిసిసి అధికార ప్రతినిధి తులసి రెడ్డి మంగళవారం మండిపడ్డారు. ఆమరణ దీక్ష చేస్తానంటూ కోర్టునే బెదిరిస్తున్నారన్నారు. జగన్ దీక్ష దేని కోసం చేస్తానని అంటున్నారని ప్రశ్నించారు. ప్రజల కోసమా, రాష్ట్రం కోసమా లేక పేదల కోసమా అన్నారు. పేదల కోసమే తన జీవితం అని ప్రసంగాలిచ్చే జగన్.. ఇప్పుడు తనను సామాన్యులను తెచ్చే వ్యాన్‌లో కోర్టుకు తెస్తారా అని పోలీసు అధికారులపై మండిపడటం విడ్డూరంగా ఉందన్నారు.
తనకు కారు ఇవ్వాలంటూ దీక్ష చేస్తారట అని ఎద్దేవా చేశారు. జగన్ అనుంగు సోదరుడు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీనియర్ ఐఏస్ అధికారి బిపి ఆచార్య కూడా అదే వాహనంలోనే కోర్టుకు వెళ్లారని అన్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కూడా బాబ్లీ విషయంలో మహారాష్ట్ర పోలీసులు ఇలాంటి వాహనంలోనే తరలించారన్నారు.
వారందరి కంటే జగన్ ఏమైనా గొప్ప వ్యక్తా అని ప్రశ్నించారు. తనను వ్యాన్‌లో న్యాయస్థానానికి తీసుకు వెళ్లారంటూ జగన్ చేసిన హైడ్రామా శోచనీయమన్నారు. తన ఆత్మగౌరవనాన్ని, ఆత్మాభిమానాన్ని దిగమింగుకొని ఆ వ్యాన్‌లో ప్రయాణించానని జగన్ చెబుతున్నారని, అంటే ఆ వాహనంలో ప్రయాణించిన ఇతరులకు ఆత్మగౌరవం లేదనేది ఆయన ఉద్దేశ్యమా అన్నారు. జగన్‌కు జడ్ ప్లస్ భద్రతను ఎందుకు కల్పించాలని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications