ఆరేళ్ల కొడుకుని చంపిన తల్లి, అక్రమ సంబంధం వల్లే?

బుధవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో దశరథ్ ఇంట్లో లేని సమయంలో కొబ్బరినార తాడుతో ఆండ్ర్యూస్‌కు మంజుల ఉరి వేసింది. దాంతో అతను మరణించాడు. దశరథ్ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు. దాంతో ఆండ్ర్యూస్ మృతి విషయం తెలిసింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దరశరథ్, మంజుల ఇటీవలే మేడ్చెల్ నుంచి వెస్ట్ వెంకటాపురానికి మారారు. అయితే, ఇది మంజులకు ఇష్టం లేదు. మేడ్చెల్‌లో ఆమె తల్లిదండ్రులు ఉంటారు. దీంతో ఆమె మేడ్చెల్‌లో ఉండాలని పోరుతూ వచ్చింది. మేడ్చేల్‌కు మారుదామని దశరథ్‌పై ఒత్తిడి తెస్తూ వచ్చింది. దశరథ్‌కు చెప్పకుండా మేడ్చెల్‌లో గది అద్దెకు అడ్వాన్స్ కూడా ఇచ్చింది.
దశరథ్ మేడ్చెల్‌కు మారడానికి ఇష్టపడకపోవడంతో మంజుల కుమారుడిని చంపిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా చేస్తానని తనను కొన్నాళ్లుగా తన భార్య బెదిరిస్తూ వస్తోందని దశరథ్ పోలీసులకు చెప్పాడు. మంజులకు మేడ్చెల్‌లో మరో వ్యక్తితో సంబంధం ఉందని, దానివల్లనే మేడ్చెల్‌కు మారుదామని భర్తపై ఒత్తిడి తెస్తోందని అంటున్నారు. మంజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications