శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయమ్మ ఘెరావ్, లక్ష్మిపేట బాధితులకు పరామర్శ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్ష్మీపేట ఘటన బాధితులను పరామర్శించడానికి వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ కారును కొంత మంది అడ్డగించారు. ఈ నెల 12వ తేదీన దళితులపై జరిగిన దాడిలో మరణించినవారి కుటుంబాలను పరామర్సించేందుకు ఆమె శనివారం లక్ష్మీపేటకు వచ్చారు.

మృతుల కుటుంబాలను పరామర్శించి తిరిగి వెళ్తుండగా వెనకబడిన తరగతులకు చెందిన బాధిత కుటుంబాలు ఆమె కారు ముందు బైఠాయించారు. దళితుల దాడిలో బీసీలు కూడా గాయపడ్డారని, వారిని కూడా పరామర్శించాలని వారు డిమాండ్ చేశారు. తన కూతురు షర్మిలతో పాటు ఆమె గ్రామానికి వచ్చారు.

లక్ష్మీపేట ఘటనలో నలుగురి మరణానికి ప్రధాన కారకుడైన వంగర మాజీ ఎంపిపి బొత్స వాసుదేవు నాయుడిని అరెస్టు చేయాలని వైయస్ విజయమ్మ డిమాండ్ చేశారు. వంగర మండలం మద్దివలసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నలుగురి మృతికి కారకుడైన వాసుదేవునాయుడినిని వెనకేసుకొస్తున్న మంత్రి కొండ్ర మురళి వెంటనే రాజీనామా చేయాలని షర్మిల, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు డిమాండ్ చేశారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని వైయస్ విజయమ్మ హామీ ఇచ్చారు. సంఘటన వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు.

English summary
YSR Congress honorary president and Pulivendula MLA car was stopped by BC victims at Laxmipet village of Srikakulam district. She promised all help to the victims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X