వైయస్ జగన్ పార్టీ పేరును తలిపిస్తూ గాలి పార్టీ

తొలి దశలో 25 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకుంటామని ఆయన చెప్పారు బళ్లారి, రాయచూరు, కొప్పళ, గదగ్ తదిత ర జిల్లాలతో పాటు ఉత్తర కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో తమ పార్టీకి విశేష ప్రజాదరణ లభిస్తుందని ఆయన చెప్పారు. కర్ణాటకలో బీదర్ నుంచి బెంగళూరు వరకు 921 కిలోమీటర్ల మేరకు 54 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించిన శ్రీరాములు శనివారం నగరానికి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం చెప్పిన కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో అటు ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ కాంగ్రెసు, ఇటు కర్ణాటకలో బీఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానానికి గట్టి షాక్ ఇస్తామన్నారు. కేంద్రలోని యుపిఎ ప్రభుత్వం తనకు ఎదురు తిరిగిన వారిని సిబిఐ ద్వారా వేధిస్తోందని ఆయన ఆరోపించారు. గాలి జనార్దన రెడ్డిని జైలుపాలు చేయడం, చివరికి బెయిల్ కూడా రాకుండా కొందరు అడ్డుకుంటున్న వైనం వెనుక పెద్ద కుట్ర ఉందని శ్రీరాములు ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్‌లో తమ ఓటు హక్కుద్వారా ప్రజలు కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ పేరులో కాంగ్రెస్‌ను చేర్చారేమిటని ప్రశ్నిస్తే కాంగ్రెస్ పేరిట తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్, వంటివి లేవా అని ఎదురు ప్రశ్న వేశారు. వచ్చేలోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రధానిని నిర్ణయించేది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలేనని ఆయన అన్నారు.
కర్ణాటకలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు ప్రధాన కారణమైన తమ నేత గాలి జనార్ధన రెడ్డిని జైలులో వేయించడం అత్యంత దారుణమని, ఇందుకు కారకులైన బిజెపి నేతలకు గట్గిగా బుద్ధి చెప్పే అవకాశం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని శ్రీరాములు చెప్పారు. బిజెపితో తమ సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లేనని ఆయన అన్నారు. త్వరలోనే ఆరుగురు బిజెపి శాసనసభ్యులు, ఇద్దరు పార్లమెంటు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి బీఎస్సార్సీపీలో చేరతారని ఆయన ప్రకటించారు. వీరే గాక ఇంకా చాలా మంది బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కొత్త పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, ఫలితాల ఆధారంగా పొత్తులపై నిర్ణయాలు తీసుకుంటామని ఆయన చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ బిజెపితో పొత్తు ప్రసక్తే ఉండదన్నారు. శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశం ఉందని శ్రీరాములు జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications