హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ విచారణ: ఈడి పిటిషన్ వాయిదా, రంగారావు సాక్షి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌ను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఈ రోజు ఈడి పిటిషన్ విచారణకు వచ్చింది. కోర్టు దానిని తిరిగి ఎల్లుండికి వాయిదా వేసింది.

హవాలా మార్గంలో జగన్ సంస్థల్లోకి తరలించిన పెట్టుబడులపై సిబిఐ సేకరించిన ప్రాథమిక సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకుని విచారణకు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టులో సిబిఐ దాఖలు చేసిన తొలి ఛార్జీషీటుతో పాటు రెండు, మూడు ఛార్జీషీటులను కూడా ఈడి తీసుకుంది. వాటిని పరిశీలించిన అనంతరం జగన్‌ను విచారించేందుకు అనుమతివ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

మరోవైపు ఓబుళాపురం మైనింగ్ కేసులో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, పిఎ అలీఖాన్‌కు బెంగళూరు కోర్టు జూలై 2వ తేది వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. జ్యూడిషియల్ రిమాండ్ పొడిగించారు.

ఎమ్మార్ కేసు విచారణను సిబిఐ కోర్టు వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడైన ఐఎఎస్ అధికారి, టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్‌వి సుబ్రహ్మణ్యం సోమవారం కోర్టుకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కోర్టుకు రూ.25వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించారు. ఎమ్మార్ కేసులో సుబ్రహ్మణ్యం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఇదివరకే ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలుపవలసి ఉంది.

ఎమ్మార్ కేసులో నిందితులు కోనేరు ప్రసాద్, విజయ రాఘవ, బిపి ఆచార్య, సునీల్ రెడ్డిలకు కోర్టు 9వ తేది వరకు రిమాండ్ విధించింది. ఎమ్మార్ కేసులో స్టైలిష్ హోం రంగారావు క్షమాభిక్ష పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. ఎమ్మార్ కేసులో తనను క్షమించాలన్న రంగారావు అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. ఈ సందర్భంగా కోర్టు... ఉత్తర్వులు తుది తీర్పుకు లోబడి ఉంటాయని వ్యాఖ్యానించింది. అప్పటి వరకు రంగారావును సాక్షిగా పరిగణించాలని సూచించింది.

English summary
Nampally CBI special court adjourned Enforcement Directorate's(ED) petition on YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy. ED filed a petition allow to question YS Jagan in DA case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X