బాధితులకు ప్రభుత్వం రూ కోటి పరిహారం ఇవ్వకుంటే.. జగన్ అల్టిమేటం..!!
విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు మాజీ సీఎం జగన్ కీలక హామీ ఇచ్చారు. ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్.. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ప్రకటించిన పరిహారం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. కార్మికులకు రావాల్సినవే ఇస్తున్నారు కానీ, ప్రభుత్వం స్పందించదా అంటూ నిలదీసారు. మరణించిన కార్మిక కుటుంబాలకు గతంలో తాము ఇచ్చిన విధంగా రూ కోటి ఇవ్వాలని డిమాండ్ చేసారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవటం పైన మాజీ సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేసారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్.. వారికి ధైర్యం చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి బాగోలేదని జగన్ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ పరిస్థితి తాము అధికారంలో ఉన్న సమయంలో ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో గమనించాలో చూడాలని వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వైసీపీ అడ్డుకుందని చెప్పారు. 2021 మార్చి లో ప్రధానికి మోదీకి లేఖ రాయటంతో పాటుగా అసెంబ్లీలో తీర్మానం చేసిన అంశాన్ని గుర్తు చేసారు. ఇలాంటి ప్రమాదం జరిగిన సమయంలో ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలని చెప్పారు. ప్లాంట్ కార్మికుల కోసం నిలబడ్డామని వివరించారు. వైసీపీ ప్రభుత్వం దిగే సమయంలో ప్లాంట్ లో 28 వేల మంది పని చేస్తున్నారని.. ఈ రెండేళ్ల కాలంలో 10,500 మందిని తెలిగించారని జగన్ లెక్కలు వివరించారు.

రూ కోటి పరిహారం చెల్లించాలి
ప్లాంట్ లో 6,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తెలిగించారని.. వీఆర్ఎస్ పేరుతో 1800 మంది పైన ఒత్తిడి చేసి తప్పించారని వివరించారు. ఉద్యోగుల సంఖ్యను 16వేలకు కుదించారు. ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని.. నాలుగు నెలల జీతాలు బకాయిలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఉత్పత్తితో ఉద్యోగుల వేతనాలకు ముడి పెట్టటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. రూ 11,440 కోట్ల ప్యాకేజీ నిర్వహణ కోసం కాదని.. వీఆర్ఎస్, బ్యాంకు లోన్ల కోసమే ఈ ప్యాకేజీని ఇచ్చారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి ఉద్యోగులు కారణం కాదన్నారు. ఇలాంటి సమయంలో మానవత్వం చూపించాలన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ప్రమాదమే విశాఖలో ఒకటి జరిగితే రూ కోటీ చొప్పున పరిహారం ఇచ్చామని గుర్తు చేసారు. పరామర్శ పేరుతో వచ్చిన లోకేష్ చేసిన వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బాధితులకు అందుతున్న పరిహారం వారికి న్యాయ పరంగా రావాల్సినవే అని చెప్పుకొచ్చారు. గతంలో తాము చేసి చూపించిన విధంగానే.. ఇప్పుడు ప్రభుత్వం బాధితులకు రూ కోటి చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం స్పందించకపోతే.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత చెల్లిస్తామని జగన్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications