ముంచేసిన 'పెద్ది' వివాదం: ఆ స్టార్ డైరెక్టర్‌తో జతకట్టిన జాన్వీ?
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం తన సినీ కెరీర్లోనే అత్యంత కీలకమైన స్టేజ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన 'పెద్ది' సినిమా వివాదం తర్వాత ఆమె తన కెరీర్ పరంగా ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. బాలీవుడ్‌లో క్లాసిక్ హిట్‌గా నిలిచిన 'తుంబాడ్' సినిమా డైరెక్టర్ రాహి అనిల్ బార్వే దర్శకత్వంలో రాబోతున్న ఓ భారీ 'క్రీచర్ హారర్' సినిమాలో జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జియో స్టూడియోస్ నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ప్రస్తుతం చర్చలు తుది దశకు చేరుకున్నాయని.. జాన్వీ కెరీర్‌లోనే ఇది అత్యంత ముఖ్యమైన చిత్రంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.
జాన్వీ కపూర్ నటించిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు సాధిస్తున్నప్పటికీ.. ఆమె పాత్ర చుట్టూ జరుగుతున్న చర్చలు మాత్రం నెగెటివ్‌గా ఉన్నాయి. ఆ సినిమాలో ఆమె పాత్రను చూపించిన విధానంపై ప్రేక్షకులు, నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జాన్వీ పాత్రను మితిమీరిన గ్లామరస్‌గా, కేవలం సెక్సీగా చూపించారంటూ సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. కేవలం కమర్షియల్ హంగుల కోసం ఇలాంటి పాత్రలను జాన్వీ కపూర్ ఎందుకు ఒప్పుకుంటోందంటూ పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ వివాదం తెలుగు ప్రేక్షకులలో జాన్వీ ఇమేజ్‌పై తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి. దీనివల్ల రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో జాన్వీకి పెద్ద స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడం కష్టమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వివాదాస్పద ఇమేజ్ ఉన్న హీరోయిన్‌ను తమ సినిమాల్లో పెట్టుకుంటే ఎక్కడ ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందో అని స్టార్ హీరోలు, దర్శకులు కాస్త వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఈ గడ్డు కాలంలోనే 'తుంబాడ్' ఫేమ్ రాహి అనిల్ బార్వే సినిమా ఆమెకు ఓ అద్భుతమైన అవకాశంగా కనిపిస్తోంది.
సాధారణంగా జాన్వీ కపూర్ చేసే కమర్షియల్, గ్లామర్ పాత్రలకు భిన్నంగా ఈ క్రీచర్ హారర్ మూవీ ఉండబోతోంది. ఈ పాత్ర కోసం జాన్వీ భారీగా కసరత్తులు చేయాల్సి ఉంటుందని, షూటింగ్ ప్రారంభానికి ముందే ఆమె ప్రత్యేక యాక్టింగ్ వర్క్‌షాప్స్‌లో కూడా పాల్గొనబోతుందని ఇండస్ట్రీ టాక్. కేవలం ఓ కమర్షియల్ హీరోయిన్‌గానే కాకుండా, తనలో మంచి నటి కూడా ఉందని నిరూపించుకోవడానికే జాన్వీ ఈ ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి అతిపెద్ద బలం దర్శకుడే. 'తుంబాడ్' సినిమాతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హారర్-ఫాంటసీని అందించిన రాహి అనిల్ బార్వే దర్శకత్వంలో గనక జాన్వీ మంచి నటనను కనబరిస్తే.. ఆమెపై వస్తున్న విమర్శలన్నింటికీ గట్టి సమాధానం ఇచ్చినట్లవుతుంది.
అసలు నిజమేమిటంటే.. జాన్వీ కపూర్ ఇప్పటికే పలువురు స్టార్ హీరోలతో, భారీ ప్రాజెక్ట్స్‌లో పనిచేసినప్పటికీ నటిగా తనను తాను నిరూపించుకోవడానికి ఇంకా పోరాడుతూనే ఉంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుందని ఒప్పుకున్నా.. ఆమె నటన పరిధిపై ప్రేక్షకుల్లో ఇంకా నమ్మకం కలగలేదు. ఈ నేపథ్యంలో ఈ క్రీచర్ హారర్ సినిమా ఆమె సినీ కెరీర్ ముఖచిత్రాన్ని మార్చే ఛాన్స్ ఉంది. 'పెద్ది' సినిమా తెచ్చిన గ్లామర్ వివాదాల నుంచి బయటపడి, తనలోని అసలైన నటిని ప్రపంచానికి చూపించాలంటే జాన్వీకి ఇలాంటి పవర్‌ఫుల్ కంటెంట్ ఉన్న సినిమా చాలా అవసరం. మరి ఈ ప్రాజెక్ట్ జానవీ కెరీర్‌ను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications