గుజరాత్, ఆస్ట్రేలియాలో స్వల్ప భూప్రకంపనలు

మరోవైపు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ సమీపంలోనూ భూమి కంపించింది. మంగళవారం ఆస్ట్రేలియాలో వచ్చిన భూప్రకంపనలు రిక్టర్ స్కేల్ పైన 5.2గా నమోదయింది. మెల్‌బోర్న్‌కు 121 దూరంలో ఇవి వచ్చాయి. యూఎస్ జియాలజికల్ సర్వే వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటలకు భూమిలో తొమ్మిది కిలోమీటర్ల లోతు నుండి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
మో పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో భూప్రకంప కేంద్రాన్ని గుర్తించారు. కిల్‌మోర్, గిప్స్‌లాండ్, డ్రాయిన్, రౌవిల్లే, మెల్‌బోర్న్ పట్టణంలోని ప్రజలు దాదాపు 30 నుండి 40 సెకన్ల పాటు భూమి కంపించిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి వివరాలు తెలియరాలేదు. సునామీ ప్రభావం లేకపోవడం మంచి ఉపశమనమని ఆస్ట్రేలియన్ సునామీ హెచ్చరికల సంఘం ప్రకటించింది.
ఆస్ట్రేలియా మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. భూప్రకంపనలు వచ్చిన పలు నగరాలలోని ఇళ్లలో ప్రకంపనలు కనిపించాయి. భవనాలు, గోడలు కూడా కాస్త కంపించాయి. దీంతో ప్రజలు భూకంపం వచ్చిందని భావించి బయటకు వచ్చారు. కాగా ఆంధ్ర ప్రదేశ్‌లో మంగళవారం సాయంత్రం గుంటూరు, కృష్ణా, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications