భాను కిరణ్‌కు వ్యతిరేకంగా నిర్మాత వాంగ్మూలం

ప్రసన్న కుమార్‌తో పాటు మహంకాళీ సినిమా నిర్మాత వై. సురేందర్ రెడ్డి కూడా సిఐడి అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. ప్రముఖ సినీ నిర్మాత సి. కళ్యాణ్‌కు చెందిన బాలాజీ ల్యాబ్‌లో జరిగిన ఆర్థిక వివాదాల సెటిల్మెంట్లలో భాను కిరణ్ పాత్రపై వారు సిఐడి అధికారులకు వివరించినట్లు చెబుతున్నారు. బాలాజీ ల్యాబ్‌లో మరో నిర్మాత నట్టి కుమార్‌ను సి. కళ్యాణ్, భాను కిరణ్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
సినీ ఫైనాన్షియర్స్‌కు, నిర్మాతలకు మధ్య తలెత్తిన పలు వివాదాల్లో భాను కిరణ్ జోక్యం చేసుకుని సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. తెలుగు సినీ నిర్మాతలు సింగనమల రమేష్, సి. కళ్యాణ్‌లపై, ఆంజనేయులు గుప్తాపై సిఐడి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. భాను కిరణ్‌తో కలిసి ల్యాండ్ సెటిల్మెంట్లకు, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల మీద వారిపై సిఐడి కేసులు నమోదు చేసింది.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సిఐడి వారిపై కేసులు నమోదు చేసింది. సి. కళ్యాణ్‌పై నిర్మాత నట్టి కుమార్ సిఐడికి ఫిర్యాదు చేశారు. నట్టి కుమార్ ఈ వ్యవహారంలో సిఐడి ముందు కూడా హాజరయ్యారు. సి కల్యాణ్, శింగనమల రమేష్, వ్యాపారవేత్త ఆంజనేయ గుప్తా ముందస్తు బెయిల్ కోసం బుధవారం కోర్టును ఆశ్రయించారు. సినీ నిర్మాత నట్టి కుమార్ తమపై సిఐడికి తప్పుడు ఫిర్యాదు చేశారని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.
-
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications