డిఎల్ఎఫ్ కేసు: పివిఆర్ ఎండి గుప్తా అరెస్టు

గుప్తాకు మినిహా మిగతావారందరికీ నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో గుప్తా కుటుంబ సభ్యులు బయటే ఉన్నారు. గుప్తా అజ్ఞాతంలోకి వెళ్లడంతో సిసిఎస్ పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేశారు. గుప్తాను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాదులోనూ శివారు ప్రాంతాల్లోనూ భూములు ఇప్పిస్తానని చెప్పి గుప్తా, తదితరులు డిఎల్ఎఫ్ నుంచి 280 కోట్లు రూపాయలు వసూలు చేశారు.
మొత్తం ఆరు ప్రాజెక్టులు ఇప్పిస్తానని గుప్తా డిఎల్ఎఫ్‌తో అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, గుప్తా తన హామీని నిలబెట్టుకోకపోవడంతో డిఎల్ఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో డిఎల్ఎఫ్ సంస్థ పేరు ప్రఖ్యాతులు గాంచింది.












Click it and Unblock the Notifications