జగన్ అరెస్టు కొంప ముంచింది: సోనియాతో కిరణ్ రెడ్డి

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తగిన ఫలితాలు సాధించకపోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అరెస్టు సమయం కూడా ఒక కారణమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పినట్లు సమాచారం. ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం పొంగు వంటిదేనని, ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను మరింత వేగంగా అమలు పరిచి ప్రజల్లోకి వెళితే కాంగ్రెస్ విజృంభించేందుకు అవకాశం ఉందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ రాగానే నేరుగా ఆయన సోనియా వద్దకు వెళ్లి అరగంటకు పైగా చర్చించారు.

ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపై ముఖ్యమంత్రి ఆమెకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ పలు సమస్యలు చుట్టుముట్టాయని, ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నానని ఆయన వివరించారు. ఉప ఎన్నికల్లో పార్టీ ఏకతాటిపై పని చేసిందని, ఇదే ఊపును కొనసాగిస్తే ఫలితం తప్పక వస్తుందని అన్నట్లు సమాచారం. ఇందుకు అధిష్ఠానం ఆశీస్సులు తనకు అవసరమని సోనియాను కిరణ్ కోరినట్లు తెలిసింది. కాగా, కాంగ్రెస్ పరాజయానికి జగన్ అరెస్టు వల్ల వచ్చిన సానుభూతి పవనాలు కొంత కారణమని, అది జరగకపోతే కాంగ్రెస్ మరో నాలుగైదు సీట్లు సంపాదించేదని ఆయన అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.

దీనికితోడు, ఎన్నికల సమయంలోనే పెట్రో ల్ ధరలను పెంచడం ప్రజాగ్రహానికి కారణమని సోనియాకు కిరణ్ వివరించారని తెలిపాయి. వైయస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సీ ట్లు గెలిచినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా లేదని, ఎన్నికలకు ఏ పార్టీ సిద్ధంగా లేదని ఆయన చెప్పినట్లు తెలిసింది. దాదాపు ఇవే అభిప్రాయాలను కోర్ కమిటీ సభ్యులు ఆంటోనీ, ప్రణబ్, చిదంబరం,ఆజాద్‌కు సీఎం కిరణ్ వివరించినట్లు సమాచారం. స్థానిక ఎన్నిక లకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని, పార్టీని త్వరగా పునర్వ్యవస్థీకరించాలని ఆజాద్‌కు సూచించినట్లు తెలిసింది.

రాష్ట్రపతి ఎన్నికల తతంగం పూర్తయ్యాక సమావేశమై వ్యూహాన్ని రూపొందిద్దామని కిరణ్‌కు ఆజాద్ స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒకరోజు పర్యటనలో ఢిల్లీ పర్యటనలో కిరణ్ కుమార్ రెడ్డి అప్పటికప్పుడే అధిష్ఠానం పెద్దలందరినీ కలిశారు. నిజానికి ఆయన ఢిల్లీ చేరుకునే వరకూ ఎవరి అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదు. విమానాశ్రయంలో దిగగానే తొలుత సోనియాతో సమావేశం ఖరారైంది. సాయంత్రం ఇతర కోర్ కమిటీ పెద్దలు కూడా ముఖ్యమంత్రికి సమయం కేటాయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+