జగన్ పార్టీ నేతలపై కాంగ్రెసు ఎంపి లగడపాటి ఫైర్

Lagadapati Rajagopal
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తీవ్రంగా మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహనరెడ్డి అరెస్టు వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని .. దాన్ని కనుగొనడానికి సిబిఐ జెడి లక్ష్మీనారాయణ సెల్‌ఫోన్ లిస్ట్‌ను బయటపెట్టి రుజువు చేస్తామని చెప్పిన వైయస్సార్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఆ కాల్ లిస్ట్‌లో కాంగ్రెస్ నాయకుల పేర్లను ఎందుకు చూపలేకపోయారని ఆయన రాజగోపాల్ ప్రశ్నించారు.

కుట్ర కట్టుకథ అని తేలిపోవడంతో మీడియాపై నెపం నెడుతున్నారని ఆయన అన్నారు. దీనికి ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలని శుక్రవారం డిమాండ్ చేశారు. పారిశ్రామికవేత్తల నుంచి జగన్ వసూలు చేసిన సొమ్మును ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. "మాట్రిక్స్ ప్రసాద్ వద్ద రూ.800 కోట్లు తీసుకున్నది నిజం కాదా? ఇండియా సిమెంట్ సంస్థ నుంచి డబ్బు తీసుకోలేదా? అధికారం మాటున వ్యాపారుల నుంచి అందిన కాడికి గుంజుకోలేదా?'' అని ఆయన జగన్‌పార్టీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.

జగన్‌ను అరెస్టు చేయడంలో సిబిఐ ఆరు నెలలు ఆలస్యం చేసిందన్నారు. తాము మీడియా సంస్థలను నడుపుతూ తోటి మీడియాపై దాడికి దిగడం భావ్యం కాదన్నారు. "గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి రూ. 60 కోట్లకు ఒప్పందం చేసుకుని ఐదు కోట్లు లంచం తీసుకున్న జడ్జి వ్యవహారాన్ని జగన్ పత్రిక రెండో పేజీలో చిన్న విషయంగా ప్రచురించింది. ఆ పత్రిక నిబద్దతకు ఇదే నిదర్శనం'' అని దుయ్యబట్టారు.

జగన్‌కు, వైయస్ జగన్ పార్టీ నేతలకు ఏ వ్యవస్థపైనా గౌరవం లేదని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, సిబిఐ, ఎసిబి... అన్నింటిపైనా వారు విమర్శలు చేస్తున్నారని, ఇప్పుడు మీడియాపై పడ్డారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+