జగన్ సాక్షి మీడియాపై వర్ల రామయ్య చిందులు

అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన వైఎస్ జగన్ తా చెడ్డ కోతి వనమల్లా చెర్చిందన్నట్లుగా ఆయన అవినీతి బురదను ఇతరులకు అంటించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే హక్కు సాక్షి మీడియా సంస్థలకు ఎక్కడిదని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఒక మహిళ ఫొటో పెట్టి రోజంతా ఎవరీ చంద్రబాల అంటూ పదే, పదే ప్రచారం చేశారని, ఆమె, వారి కుటుంబ సభ్యులు ఎంత బాధపడి ఉంటారోనని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాల మీద, దర్యాప్తు సంస్థలపైఐ విలేకరుల, పత్రికల యాజమాన్యాల మీద అందరిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు దాడి చేస్తున్నారన్నారు. ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు.
ఈ నెల 20వ తేదీన సాక్షి ఛానెల్‌లో ప్రసారం చేసిన, దినపత్రికలో ప్రచురించిన కథనాలు పూర్తిగా అవాస్తవామన్నారు. చంద్రబాబు నాయుడు తాను సీఎంగా ఉండగా 16 వేల కోట్ల రూపా యలు తన బంధువుల పేరిట విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారని కొన్ని తప్పుడు ఖాతాలు ఇచ్చారని ఆయన అన్నారు. అంతర్జాతీయ బ్యాంకు అకౌంట్ నెంబర్ కేవలం 13 అంకెలు మాత్రమే ఉంటుందని, కానీ ఈ విషయాన్ని ఘనత వహించిన సాక్షి యాజమాన్యం గుర్తించినట్లు లేదని అందుకే 14 నెంబర్లున్నట్లుగా చెప్పుకొచ్చిందని ఆయన అన్నారు.
సాక్షి యాజమాన్యం మాదిరిగా తాను అవాకులు, చెవాకులు మాట్లాడడం లేదని, అన్ని ఆధారాలతో మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. ఇతరులను ఎల్లో జర్నలిజమంటూ నిందిస్తున్న సాక్షిది డబుల్ ఎల్లో జర్నలిజమని ఆయన శివాలెత్తారు. ఖాతాలున్నట్లుగా పేర్కొన్న పేర్లతో ఎవరు దొరకలేదని, నాగమణి అనే గృహిణి మాత్రం చంద్రబాబుకు బంధువన్నారు. తనకు పాస్‌పోర్టు కూడా లేదని మీడియాకు ఆమె చెప్పారన్నారు. కోలా కృష్ణమోహన్ ఇచ్చిన ఖాతాలు నెంబర్లు ఎలా తప్పో, ఆ బ్యాంకులు ఎప్పుడు పుట్టాయో ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications