సిబిఐ జెడి లక్ష్మినారాయణపై సాక్షి కుట్ర: విహెచ్

V Hanumanth Rao
న్యూఢిల్లీ: సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోనహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా కుట్ర చేస్తోందని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. లక్ష్మినారాయణను ఎలాగైనా అక్కడి నుంచి పంపించి వేయాలని కుట్ర చేస్తున్నట్లు ఆయన అనుమానించారు. లక్ష్మినారాయణ మీడియాతో మాట్లాడడంపై ఆరోపణలు చేయడం సరి కాదని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

సాక్షి మీడియా వైయస్ జగన్ కోసం మాత్రమే పనిచేస్తోందని ఆయన అన్నారు. జగన్ నీతినిజాయితీ గలవాడని చెప్పుకోవడానికి మాత్రమే సాక్షి పనిచేస్తోందని ఆయన అన్నారు. గతంలో మీడియా పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మొద్దు శీనుతో మాట్లాడిందని, నక్సలైట్లను కూడా ఇంటర్వ్యూలు చేసిందని, అటువంటి స్వేచ్ఛ మీడియాకు ఉండాలని, వారి కాల్ లిస్టులు బయటపెట్టడం సరి కాదని ఆయన అన్నారు. కుట్రలో భాగంగానే లక్ష్మినారాయణపై బురద చల్లి కుట్ర చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉప ఎన్నికల ఫలితాలంపై పార్టీలో మేధో మథనం జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి, వారి అభిప్రాయాలు తీసుకుని కార్యాచరణను రూపొందించుకోవాలని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీదే విజయమని ఆయన అన్నారు. కంటితుడుపు సమీక్షలు కూడదన, కార్యకర్తల సమావేశాల్లో మేధోమథనం జరిగితేనే పార్టీని బలోపేతం చేయడానికి తగిన సూచనలు వస్తాయని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి పేరును ప్రస్తావించడం మానుకోవాలని ఆయన అన్నారు. గతంలో చేసిన తప్పులకు పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా చూడాలని ఆయన అన్నారు. చిరంజీవి ఏదైనా అనవచ్చు గానీ వాస్తవాలు ప్రజలకు తెలియాలని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా సానుభూతి కొంత మేరకు పనిచేసిందని ఆయన అన్నారు.

వైయస్ జగన్ ఓదార్పు యాత్ర పేరుతో ఊరూరా తిరుగుతూ విమర్శలు చేస్తుంటే కాంగ్రెసు నాయకులు ఏమీ మాట్లాడలేదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల సమయంలో మాత్రమే వైయస్ జగన్‌పై తమ పార్టీ నాయకులు ఎదురు దాడికి దిగారని ఆయన గుర్తు చేశారు. వైయస్ జగన్‌పై ఎదురుదాడిని కాస్తా ముందుగా ప్రారంభించి ఉంటే కాంగ్రెసుకు మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవని తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+