జగన్ బంధువునని చెప్పిన వ్యక్తి ఘరానా మోసం

తాను వైయస్ జగన్‌కు బంధువునని అతను చెప్పుకుంటుండేవాడు. ఆయన తన కార్యాలయంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఫొటో కూడా పెట్టుకున్నాడు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి నుంచి దాదాపు కోటి రూపాయల వరకు అతను వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఒక్కో వ్యక్తి నుంచి అడ్వాన్స్‌గా మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు.
అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు పంపిస్తానని, ముందుగా కొంత డబ్బు ఇవ్వాలంటూ కోటి రూపాయల దాకా వసూలు చేశాడని, మిగతా మొత్తం విదేశాలకు పంపించిన తర్వాత ఇవ్వాలని చెప్పాడని బాధితులు అంటున్నారు. ఆరు నెలలుగా బాధితులు అతని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
వారం పది రోజుల నుంచి రామకృష్ణా రెడ్డి కనిపించుకుండా పోయాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications